English | Telugu
ఆలీ పెద్ద కోతి..మందు కొట్టి చేపలతో మాట్లాడే శీను
Updated : Nov 10, 2022
ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పక్క కమెడియన్ గా బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు సెలెబ్రిటీస్ ని తన షోకి తీసుకొచ్చి ఎన్నో విషయాలను వాళ్ళ నుంచి రాబడతున్నాడు. ఇక ఇప్పుడు ఆలీతో సరదాగా షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను వచ్చారు. డార్లింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఈ డార్లింగ్ దొరికాడని చెప్పింది తులసి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారినట్లు చెప్పింది.
తులసి మూవీ ఇండస్ట్రీలోకి మూడు నెలల పసి కాదుగా ఉన్నప్పుడే ఎంటర్ అయ్యిందని చెప్పింది. " మూడు నెలలప్పుడు సినిమాకు పరిచయమయ్యాను.. మూడేళ్లకు డైలాగ్ చెప్పాను. వందేళ్ల సినీ పరిశ్రమలో నేను 56 ఏళ్ళ నుంచి ఉంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఆలీతో కలిసి చిన్నప్పుడే కలిసి నటించాను అని చెప్పిన తులసి ఆలీ ఒక సినిమా సెట్ లో చేసిన అల్లరి పనిని చెప్పుకొచ్చింది. "నాలుగు స్తంభాలాట సినిమాసెట్ లో నాకు ఆలీ సైట్ కొట్టేవాడు.. చాలా చిన్నగా ఉండేవాడు.. కానీ పెద్ద కంత్రీ” అని చెప్పగా ఆలీ “నేను అప్పుడు నిక్కరు వేసుకున్నాను కానీ బటన్ పెట్టుకోలేదు.. అప్పుడు ఆమె చూసి.. ఒరేయ్.. బటన్ వేసుకోలేదురా అని నవ్వింది. వెంటనే నేను సౌండ్స్ చేసి ఏడిపించాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ శ్రీను మందు బాగా కొడతాడని, ఆ సమయంలో అక్వేరియంలో ఉన్న చేపలతో మాట్లాడతాడని చెప్పి నవ్వులు పూయించాడు.