English | Telugu

హీరోయిన్స్ ని తొక్కేద్దామనుకుంటున్నారా... సంతూర్ మమ్మీ సుమ

సుమ హోస్టింగ్ చేయడమే కాదు అప్పుడప్పుడు సరదాగా, స్పాంటేనియస్ గా చెప్పే కామెంట్స్, కామెడీ బిట్స్, చేసే డాన్సులు, వేసే డ్రెస్సులు కూడా బాగా ఫన్నీగా ఉంటాయి. అలాంటి కనకాల ఫామిలీ నుంచి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో రోషన్ కనకాల నటించిన మూవీ "బబుల్ గం"ని ఆడియన్స్ బాగా ఆదరిస్తుండడంతో ఆ మూవీకి మంచి టాక్ వస్తోంది. అందులోనూ సుమ దగ్గరుండి స్పెషల్ కేర్ తో ప్రొమోషన్స్ చేసింది. దగ్గరుండి ప్రెస్ మీట్స్ పెట్టించింది.

నేచురల్ హీరోస్ తో తన తనయుడి మూవీ గురించి మాట్లాడించింది. ఇక ఇప్పుడు మౌత్ పబ్లిసిటీతో మూవీ మంచి టాక్ ని సొంత చేసుకునేసరికి సుమ ఆనందానికి అంతే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో హల్చల్ మచాయిస్తోంది. ఆమె హోస్టింగ్ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సుమ ఇప్పుడు హీరోయిన్స్ కి పోటీగా రెడీ అవుతోంది. రీసెంట్ గా బబుల్ గం పేరుతో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఒక రేంజ్ లో ఫోటో షూట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఈ పిక్స్ మాములుగా లేవు. అసలు సుమనా ఎవరైనా హాలీవుడ్ హీరోయిన్ ఆ అన్న రేంజ్ లో ఉన్నాయి.. "స్వాగ్ అక్క" అని ఆరియానా కామెంట్ చేసింది. నెటిజన్స్ ఇక ఊరుకుంటారా బీభత్సంగా కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. "హబ్బా భయమేస్తోంది మేడం లేడీ సలార్ లుక్...చాలా యంగ్ గా, కొత్త హీరోయిన్ లా కనిపిస్తున్నారు, ఏంటి మేడం హీరోయిన్స్ ని తొక్కేద్దామనుకుంటున్నారా...సడెన్ గా చూసి హాలీవుడ్ నటి అనుకున్నా...ఇదే కదా మేకప్ పవర్ అంటే...సంతూర్ మమ్మీ...బబుల్ గం 2 హీరోయిన్ సుమ గారు..హీరో రాజీవ్ కనకాల గారు..హీరోయిన్ మెటీరియల్,..నువ్వు హీరోయిన్ గా ట్రై చేస్తున్నావా...సుమ గారికి మేకప్ వేసిన ఆర్టిస్ట్ సూపర్..." అంటూ ఫన్నీ కామెంట్స్ ని పెట్టారు.