English | Telugu

భార్యాభర్తల కోరికలు... ఆన్లైన్ లో పెళ్లిలు.. పౌర్ణమి రోజు ఫస్ట్ నైట్!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ కామెడీగా సాగిపోయింది. ఈ వారం ఈ ఎపిసోడ్ కి వచ్చిన సీరియల్ వైఫ్ అండ్ హజ్బెండ్స్ తో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ గేమ్ ని ఆడించింది. స్టేజి మీదకు ఒక ముడుపులు చెల్లించుకునే "విష్ ట్రీ"ని తీసుకొచ్చింది. ఇక ఒక్కో సీరియల్ జంటను పిలిచి వాళ్ళ వాళ్ళ సీరియల్ కోరికలను కాయితాల మీద రాయించి చదివించి ఆ చెట్టుకు కట్టించింది.

ఐతే మరి ఈ సీరియల్ వైఫ్ అండ్ హజ్బెండ్స్ ఏమేం కోరికలు రాసారో వింటే భలే ఫన్నీగా ఉంటుంది...ముందుగా "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ నుంచి మీనా అండ్ బాలు వచ్చారు. "సీరియల్ లో నాకు నచ్చకుండా పెళ్లి జరిగింది కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి" అని రాసాడు బాలు. "షూటింగ్ లో ఫస్ట్ నైట్ సీన్ క్యాన్సిల్ అవ్వాలి సెట్ లో ఉన్న వాళ్లందరినీ మా హీరో బాలు గారు ఫస్ట్ నైట్ సీన్ కి ఇన్వైట్ చేసారు అందుకే క్యాన్సిల్ అవ్వాలని అనుకున్నా" అని చెప్పింది సీరియల్ హీరోయిన్ మీనా. తర్వాత "బ్రహ్మముడి" సీరియల్ నుంచి కావ్య అండ్ రాజ్ వచ్చారు. "టెంపుల్ లో కావ్యని ఎత్తుకుని తిరిగే సీన్స్ ని డైరెక్టర్ కి క్యాన్సిల్ చేయించాలి ఎందుకంటే ఈమధ్య కావ్య బాగా బరువు పెరిగిపోయింది." అని చెప్పాడు రాజ్. "నా భర్త రాజ్ నా కాళ్లకు మాత్రమే రాకుమారుడిలా మిగతా వాళ్లకు వికారం వచ్చేలా కనిపించాలి" అని తన కోరిక రాసింది కావ్య. తర్వాత నాగ పంచమి సీరియల్ నుంచి మోక్ష అండ్ పంచమి వచ్చారు.

"మన ఫస్ట్ నైట్ ని పౌర్ణమి రోజున కాకుండా ఏదైనా రోజున పెట్టాలి ఎందుకంటే సీరియల్ లో పౌర్ణమి రోజున ఫస్ట్ నైట్ పెడితే పాములా మారిపోతుంది" అని రాసాడు మోక్ష. "నా ఫస్ట్ నైట్ సీన్స్ అన్నీ పౌర్ణమి రోజునే జరగాలి" అని రాసింది పంచమి. తర్వాత మామగారు సీరియల్ నుంచి గంగా అండ్ గంగాధర్ వచ్చారు. "మా సీరియల్ పేరు మామగారు కదా ఆ టైటిల్ మార్చి భర్తగారు అని పెడితే బాగుంటుంది ఎందుకంటే మామగారు తప్ప భర్తగారు కనిపించట్లేదు అందుకే టైటిల్ మార్చాలి" అన్నాడు గంగాధర్ . " మా ఆడవాళ్లు కస్టాలు చాలా ఉంటాయి. ఎంత సేపు రెడీ అవుతావు అంటారు. సో ఈయన కూడా ఒక రోజు అమ్మాయిలా రెడీ అవ్వాలి, బెల్లి డాన్స్ చేయాలి సీరియల్ లో ఐనా ఎక్కడయినా ఓకే " అని చెప్పింది గంగ. తర్వాత కుంకుమ పువ్వు సీరియల్ నుంచి బంటి అండ్ అంజలి వచ్చారు. "నెక్స్ట్ షెడ్యూల్ లో షూటింగ్ టైంలో బంటికి లూజ్ మోషన్స్ వచ్చేయాలి" అని అంజలి రాస్తే "పెళ్లి అనేదాన్ని ఆన్లైన్ చేయాలి.. రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ చేయొచ్చు.." అని బంటి రాసాడు. "పెళ్లి ఆన్లైన్ లో ఓకే మిగిలినవన్నీ వీడియో కాల్ లోనా" అంటూ ఆట పట్టించింది బ్రహ్మముడి కావ్య.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.