English | Telugu

రైతులని తిట్టిన అమర్ దీప్ కి కొవ్వెక్కిందంటున్న నెటిజన్లు!

రైతెక్కువనా ? బిటెక్ చదువుకున్నోడు ఎక్కువనా అంటే బీటెక్ చదువుకున్నోడే ఎక్కువంటున్నాడు అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ లో సెలబ్రిటీగా అడుగుపెట్టి.. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. అయితే ఈ నామినేషన్లో రైతులని కించపరుస్తూ మాట్లాడినిన అమర్ దీప్ ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రైతుల గురించి ఏం తెలుసని మాట్లాడావంటూ, అమర్ దీప్ ని ఎలిమినేట్ చేయాలంటూ, రైతులకి క్షమాపణలు చెప్పాలంటు నెట్టింట్ల పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

జానకి కలగనలేదు సీరియల్ లో తల్లి చాటు బిడ్డలా నటించిన అమర్ దీప్.. బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక ఫైర్ స్టార్ లాగా రెచ్చిపోయాడు. హౌజ్ లోకి వచ్చి పది రోజులైన అసలు కన్పించలేదు. అది చూసిన నాగార్జున.. మొన్న ఆదివారం ఎపిసోడ్‌లో అమర్ దీప్ అసలు హౌజ్ లో ఉన్నావా అంటే.. హా ఉన్నాన్నాడు. హౌజ్ లో కాదు అసలు టాస్క్ లో కానీ గేమ్ లో కానీ అసలెక్కడా కనపడటం లేదని అమర్ దీప్ ని నాగార్జున తిట్టాడు. అయితే అదే టైమ్ లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని గట్టి పోటీ ఇచ్చావని నాగార్జున మెచ్చుకునేసరికి మన అమర్ దీప్ కి తలకొట్టేసినట్టయిందంట. ఇక సోమవారం నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇదే అదునుగా భావించి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ ని వీక్ చేయాలని అతన్ని ఇష్టమొచ్చినట్టు మాటలన్నాడు.

నామినేట్ చేస్తున్నానని చెప్పి పల్లవి ప్రశాంత్ ని కించపరస్తూ, మొత్తం రైతులనే తక్కువ చేసి మాట్లాడాడు అమర్ దీప్. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రతీసారీ రైతుబిడ్డ రైతుబిడ్డ అంటూ సింపతీ క్రియేట్ చేస్తున్నావ్? మేం తక్కువనా అంటు అమర్ దీప్ స్టార్ట్ చేశాడు. బిటెక్ తెలుసా? ఎంత కష్టపడాలో తెలుసా? జాబ్ ఎలా వస్తుందా తెలుసా అంటూ సినిమా డైలాగ్ కాపీ కొట్టి.. రైతు బిడ్డ పల్లవి మొదలైన ప్రశాంత్ ని తిట్టాడు. అప్పటికే పల్లవి ప్రశాంత్ ని ముగ్గురు నామినేట్ చేయడంతో బురద నీళ్ళు ఎక్కువగా పడిన ప్రశాంత్ వణికిపోతుంటే, మంచిగా నిల్చోమని చెప్పి రాక్షస ఆనందం పొందాడు అమర్ దీప్. ఇక రైతులని తక్కువ చేసి మాట్లాడిన అమర్ దీప్ కి సపోర్ట్ గా ఆట సందీప్, రతికలు వికృతంగా చప్పట్లు కొట్టారు. ఇక పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. నన్ను కొందరు నమ్మించి మోసం చేశారని, సూసైడ్ చేసుకుందామనుకున్నా అదే టైమ్ లో మా నాన్న నాకు బ్రతకమని, నలుగురికి ఆదర్శంగా ఉండమని చెప్పాడని ఏడుస్తూ చెప్పాడు పల్లవి ప్రశాంత్. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి రావడానికి ఆరునెలలు కుక్కలాగా తిరిగానని పల్లవి ప్రశాంత్ చెప్పగా.. ఇప్పుడేం చేస్తున్నావ్ ఇక్కడికి వచ్చి అని రతిక అంది. ఇండైరెక్ట్ గా నా వెనుక కుక్కలాగా తిరుగుతున్నావని రతిక అనడంతో పల్లవి ప్రశాంత్ ఏం అనలేకపోయాడు. ఇక అమర్ దీప్ ఏదో హీరోలాగా ఫీల్ అయిపోయి కామన్ మ్యాన్ ని టార్గెట్ చేసి మాట్లాడాడు. అయితే మధ్యలో రైతులని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకంటూ నెటిజన్లు అమర్ దీప్ ని బూతులు తిడుతున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.