English | Telugu

రైతు బిడ్డ అంటూ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్!


బిగ్‌ బాస్ సీజన్-7 లో సెలబ్రిటీలుగా ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్, ప్రియాంక జైన్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, దామిణి, షకీల, టేస్టీ తేజ.. ఇలా అందరూ కలిసి నామినేషన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. తెలుగు టీవీరంగంలోకి అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఈ షోకి మాములు క్రేజ్ లేదు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతీ సామాజిక మాధ్యమాలలో ఈ బిగ్ బాస్ క్రేజ్ ఉంది. అయితే ‌ఇందులోకి సెలెక్ట్ అవడమే చాలా కష్టం. అలాంటిది ఇందులోకి వచ్చాక ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తుంటారు. ఒకవేళ గేమ్ ని ఫాలో కాకుంటే, హౌజ్ మేట్స్ తో సరిగ్గా కలవకుంటే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తాడు. ఇలా గతవారం ఎలిమినేట్ అయింది కిరణ్ రాథోడ్. కాగా ఇప్పుడు కొత్తగా నామినేషన్లు మొదలయ్యాయి. సోమవారం నాటి కంటెస్టెంట్స్ చేసిన నామినేషన్లు వాడీవేడీగా సాగాయి. ఆట సందీప్ కి పవరస్త్ర రావడంతో బిగ్ బాస్ ఒకరిని నామినేట్ చేయడానికి స్పెషల్ పవర్ ఇచ్చాడు. దాంతో ప్రిన్స్ యావర్ అని ఆట సందీప్ చెప్పాడు. ఎందుకు బ్రో నన్నే టార్గెట్ చేస్తున్నావని ప్రిన్స్ యావర్ అన్నాడు. టార్గెట్ చేయాలనుకుంటే నిన్నెందుకు టార్గెట్ చేస్తా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తానుని ఆట సందీప్ అన్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది హౌజ్ లో‌ని వాళ్ళంతా ఎంతలా టార్గెట్ చేశారో తెలుస్తుంది.

గౌతమ్ కృష్ణ తన‌ నామినేషన్ పల్లవి ప్రశాంత్ కి అని చెప్పి, కారణం చెప్తూ.. ' నీకు బయట మంచి ఫాలోయింగ్ ఉంది‌. ఒక పోస్ట్ పెడితే లక్ష రూపాయిలు వస్తాయి. ఇక్కడికి వచ్చి సింపతీ చూపించాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇక ప్రియాంక జైన్ వచ్చి ప్రతీసారీ రైతు బిడ్డ అంటూ సింపతీ ప్లే చేస్తుంటే అవదు. మాతో కలిసి ఉండు. ఇండివిడ్యువల్ గేమ్ వద్దని అంది. ఆ తర్వాత ఆట సందీప్, రతికలు తమ పైశాచికత్వాన్ని కామన్ మ్యాన్ పై చూపించి బయటపెట్టారు. ఇక అమర్ దీప్ అయితే సాటి కంటెస్టెంట్ అని మర్చిపోయి.. రేయ్, చెప్పరా, ఉండరా అనే పదాలు వాడాడు. షకీల సైతం గ్రూప్ లో కలిసిపోయి పల్లవి ప్రశాంత్ ‌ని నామినేట్ చేసింది. దీంతో అందరు కలిసి కార్నర్ చేసినట్టు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు సరిగ్గా తెలుస్తుంది. దాంతో నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు. అయితే అమర్ దీప్ రైతులను తక్కువ చేసి మాట్లాడిన మాటలతో తనపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.