English | Telugu

మూడు నెలల్లో శుభవార్త చెప్తానని మాటిచ్చిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -198 లో.. అప్పుని కనకం గదిలో పెట్టి గడియపెడుతుంది. మరొకవైపు కావ్య దుగ్గిరాల ఇంట్లో కృష్ణుడికి పూజ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాతనే ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావ్? పూజ చేస్తున్నావని కావ్యని ఇందిరాదేవీ అంటుంది.

ఆ తర్వాత కావ్యని పొగడటం ఇష్టం లేని రుద్రాణి గొడవపెట్టాలని ట్రై చేస్తుంది. అంటే నీ కోడలు అలాంటివి ఏవి చెయ్యలేదనా? నీ ఉదేశ్యమని రుద్రాణి అనగానే.. నువ్వు మధ్యలో కలుగజేసుకొని గొడవలు పెట్టాలని చూడకని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రాజ్ ఒక నెక్లెస్ తీసుకొని వస్తాడు. అది చూసి ఏంటని అపర్ణ అడుగగా.. మిడిల్ క్లాస్ వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు మనం డిజైన్స్ వేసి పంపించాం ఆల్ మోస్ట్ ఆ కాంట్రాక్ట్ మనకి ఓకే కాదని అనుకునే టైమ్ లో కావ్య సరిచేసి పంపించి ఒకే చేసిందని, వాళ్ళు మనకి శాంపిల్ గా ఈ నెక్లెస్ పంపించారని, ఇది కావ్యకి గిఫ్ట్ గా ఇద్దామని తెచ్చానని రాజ్ అనగానే.. అందరు సంతోషిస్తారు. అపర్ణ మాత్రం రాజ్ వంక కోపంగా చూస్తుంది. నెక్లెస్ కావ్య మెడలో రాజ్ వెయ్యగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నాకొక కోరిక ఉంది. నాకు మూడు నెలల్లో మీరిద్దరు కలిసి శుభవార్త చెప్పాలని సీతరామయ్య అనగానే రాజ్, కావ్య, అపర్ణ షాక్ అవుతారు. నాకు మాట ఇవ్వు రాజ్ అని సీతరామయ్య అనగానే.. రాజ్ సరే అంటాడు.. మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. అప్పు మాటల్లో ఏదో గొడవకి వెళ్తుంది అని అర్థం చేసుకొని వెంటనే అప్పు దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. మరొక వైపు ఇందిరాదేవితో తన సంతోషన్ని పంచుకుంటుంది కావ్య. నన్ను భార్యగానే ఒప్పుకోని నా భర్త ఇప్పుడు ఇలా నా గురించి అలోచించినందుకు, నాకు సంతోషంగా ఉందని కావ్య చెప్తుంది.

మరొకవైపు రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్లిన అపర్ణ.. ఇదంతా ఏంటి కావ్యని భార్యగా ఒప్పుకున్నవా అని అడుగుతుంది. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. నీ ప్రవర్తన లో ఏదో తేడా వచ్చిందని అపర్ణ అనగానే.. నేను ఇప్పుడేం చెప్పాలేనని రాజ్ అంటాడు. నువ్వు ఇలా చేస్తుంటే కావ్య నీపై ఆశలు పెంచుకుంటుందని అపర్ణ అంటుంది. మరొక వైపు అప్పు గోడ దూకి గ్రౌండ్ దగ్గరికి వెళ్లి .. అక్కడ క్రికెట్ ఆడుతున్న వాళ్లతో గొడవపడుతుంటే అక్కడికి కళ్యాణ్ వెళ్తాడు. వాళ్ళు కళ్యాణ్ , అప్పులతో వెటకారంగా మాట్లాడేసరికి అప్పుజి కోపం వచ్చి వాళ్ళని కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.