English | Telugu

ఆ బూతు రోజాకు బాగా అర్థమైంది!

బుల్లితెరపై బూతుల ప్రవాహానికి 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఎప్పుడో పునాది వేశాయి. ప్రత్యామ్నాయ పదాలు సృష్టించి మరీ బూతులను యథేచ్ఛగా వాడేస్తున్నారు. 'నువ్ మింగేయ్', 'మింగుతా' పదాలు కొంతమంది టీమ్ లీడర్లు స్కిట్లలో ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. ప్రజల ఆదరణ ఉండటంతో కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ నడుస్తోంది. ఆ బూతులు మాట్లాడితే చాలామంది అర్థమవుతాయి. అయితే, డైలాగ్ ఫినిష్ చెయ్యకముందే బూతు ఏంటో అర్థం చేసుకుని మరీ రోజా నవ్వడం విశేషం.

'నువ్ తోప్ ఎహే పూరి' అని పూరి పిండిని అజర్ పొగుడుతూ ఉంటాడు. 'ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది?' అని ఆది అడగటంతో 'ఇలా పొగిడితే పొంగుతారంట కదా' అని ఆన్సర్ ఇస్తాడు. 'ఇలా పొంగుతారు' అనే డైలాగులు వేస్తే ఆడియన్స్...' అని ఆది డైలాగ్ ఫినిష్ చెయ్యకుండా వదిలేశాడు. పొంగు పదానికి ప్రాస చూసుకుంటే 'మింగు' వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా! యూట్యూబ్‌లో కామెంట్స్ చూస్తే ఆది స్కిట్ సూపర్ అన్నవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. సో... జనాలు యాక్సెప్టెన్స్ ఉందని అనుకోవాలి.

మరో స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ బ్యాక్ సీట్ మీద సెటైర్ వేస్తూ 'మీరు కింద పడతారని ముందే తెలుసా? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని మరీ పడిపోతేనూ' అని లేడీ గెటప్ వేసిన సాయి డైలాగ్ చెప్పాడు. దానికీ రోజా పడి పడి నవ్వారు. అయితే, రోజా మీద ఒకరు యూట్యూబ్‌లో కామెంట్ చేశారు. "ఇమ్ము... ఫీల్ అవ్వకు. రోజా ఇరగబడి నవ్వుతుంది. రోజా ఎయిర్‌బ్యాగ్స్‌తో పోలిస్తే ఇమ్ము 100% బెటర్' అని కామెంట్ చేశారు ఒక నెటిజన్. ఒకొకరు జబర్దస్త్ క్వీన్ రోజా అని ఆమెను పొగిడారు. సెలబ్రిటీలకు ఇవన్నీ కామన్. తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఉంటారు.