English | Telugu
రెడ్ రోజ్ ఇచ్చేసి ఐ లవ్ యు చెప్పేసిన నవ్య స్వామి!
Updated : Sep 30, 2022
"నా పేరు మీనాక్షి" సీరియల్ తో నవ్యస్వామి తెలుగు ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయిపోయింది. తర్వాత "ఆమె కథ" సీరియల్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇందులో ఆమె అందంతో పాటు నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో నటించేటప్పుడే రవికృష్ణతో మంచి బాండింగ్ అనేది ఏర్పడింది నవ్యస్వామికి.
అలా బుల్లితెర మీద ఆ ఛానెల్ లేదు ఈ ఛానల్ లేదు ఎందులో ఐనా సరే వీళ్ళిద్దరూ కనిపించకుండా ఉండరు. ఐతే వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కాదు లవ్ ఉందని అనుకునేలా ప్రవర్తించేవారు. ఐతే ఈ విషయాన్ని ఎవరైనా అడిగితే వాళ్ళు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేసేవాళ్ళే కాదు ఓన్లీ ఫ్రెండ్స్ అంటూ తప్పించుకునేవాళ్ళు. ఐతే ఇప్పుడు నవ్యస్వామి రెడ్ రోజ్ ఇచ్చి మరీ రవిక్రిష్ణకు ప్రొపోజ్ చేసేసింది. ప్రతీ ఆదివారం జీ తెలుగులో వస్తున్న లేడీస్ అండ్ జెంటిల్మన్ షోలో నెక్స్ట్ వీక్ ఈ జంట రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
"టు ది లవ్ ఆఫ్ మై లైఫ్ రవి, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా మారాను..ఇక ముందు నా ప్రపంచమే నువ్వు..ఐ లవ్ యు" అంటూ రెడ్ రోజ్ ఇచ్చేసింది. ఇక రవికృష్ణ మంచి ఎక్సయిటింగ్ గా ఉన్నాడేమో రెడ్ రోజ్ అందుకుని నవ్య ప్రేమను యాక్సెప్ట్ చేసేసాడు. ఇంకా వీళ్ళ జంటలతో పాటు ఈ గేమ్ షోకి వరుణ్ సందేశ్, వితిక సేరు, నోయెల్, లేడీ కమెడియన్ రోహిణి జంటలుగా ఎంట్రీ ఇచ్చారు.