English | Telugu
జర్మనీలో నేహా చౌదరి మొదటి క్రిస్మస్ !
Updated : Dec 26, 2023
బిగ్ బాస్ సీజన్-6 తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది నేహా చౌదరి. బిగ్ బాస్ సీజన్-6 గ్రాంఢ్ ఫినాలే రోజున పెళ్ళి కూతురిగా రెడీ అయి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ సీజన్లలో ఏ కంటెస్టెంట్ ఇలా పెళ్ళికూతురిని చేసాక బిగ్ బాస్ కి రాలేదు. ఇక నేహా చౌదరి ప్రస్తుతం జర్మనీలో ఉంటుంది. నిన్నటి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా అక్కడ తను ఎలా జరుపుకుందనేది అంతా వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది.
నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్ అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి.
క్రిస్మస్ అనగానే సాంటా క్లాజ్, గిఫ్ట్స్, క్రిస్మస్ ట్రీ, చాక్లెట్లు.. ఇలా అన్నీ గుర్తొస్తుంటాయి. వీటన్నింటిని షాప్ లో నుండి తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ చేసి అందంగా ముస్తాబు చేసి చాలా గ్రాంఢ్ గా జరుపుకుంటారు. అయితే నేహా చౌదరి ప్రస్తుతం జర్మనీలో ఉంటుంది. అక్కడ తన భర్త శ్రీనివాస్ తో కలిసి క్రిస్మస్ వేడుకని చేసుకుంది. అయితే తను జర్మనీలో ఉండగా వచ్చిన మొదటి క్రిస్మస్ పండుగ కాబట్టి ఇది తనకెంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది నేహా. తన భర్త శ్రీనివాస్ ని షాపింగ్ కి తీసుకెళ్ళి రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ కొనుక్కొచ్చి, వాటిని వాళ్ళ రూమ్ లో జాగ్రత్తగా డెకరేట్ చేసింది. ఇదంతా తను ఎలా చేసిందో వివరిస్తూ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలిపింది. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.