English | Telugu

కార్తీక దీపం మోనితకు రాష్ట్రీయ‌ గౌరవ్ అవార్డ్ !


తెలుగు టీవీ సీరియళ్ళలో ఒకప్పుడు 'మొగలిరేకులు' ఎంత ఫేమసో.. ఈ మధ్యకాలంలో వచ్చిన కార్తీకదీపం అంతే ఫేమస్. తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి ఈ సీరియల్ ఎంతగా నచ్చిందంటే డాక్టర్ బాబు, వంటలక్కలని తమ సొంతింటి మనుషులుగా చూసుకునేనంతగా ఆకట్టుకుందని చాలామంది అభిమానులు చాలాసార్లు చెప్పుకొచ్చారు‌. అయితే ఈ సీరియల్ లో వంటలక్క-డాక్టర్ బాబులకి ఎంత క్రేజ్ వచ్చిందో లేడీ విలన్ మోనితకి అంతే క్రేజ్ వచ్చింది.‌ ప్రతీసారీ వంటలక్క-డాక్టర్ బాబు మధ్యలో దూరి వారిని కష్టాల్లోకి నెట్టి డాక్టర్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ సీరియల్ కి శుభం కార్డ్‌ పడింది. ‌ఇక ఆ సీరియల్ ముగిసాక వంటలక్క ఏ సీరియల్ లో నటించలేదు‌.‌ డాక్టర్ బాబు మాత్రం రాధకు నీవేరా ప్రాణం అనే‌ సీరియల్ లో‌ నటించాడు. ఇక మోనిత అలియాస్ శోభాశెట్టి మాత్రం బిగ్ బాస్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్ నెగెటివిటి తెచ్చుకున్న కంటెస్టెంట్ శోభాశెట్టి. అయితే తనకి ఈ మధ్య ఒక అవార్డ్ వచ్చింది. కార్తీక దీపం సీరియల్ లో తను చేసిన మోనిత పాత్రకి గాను ఉత్తమ లేడీ విలన్ అవార్డు రావడంతో ఈ అవార్డ్ అందుకోడానికి ఓ వేడుకకు హాజరైంది శోభాశెట్టి. అక్కడ అవార్డు గ్రహీతలకు కాంగ్రెస్ సీనియర్ లీడర్, పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం చేశారు. తనకి ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్‌’ దక్కడంతో సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది శోభాశెట్టి. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్‌తో వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న శోభాశెట్టి.. సీజన్-7 లో టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ జాబితాలో శోభా నిలిచింది. హౌస్‌లో అడుగుపెట్టేముందు.. ఇప్పటి వరకు తను కార్తీకదీపం మోనితగానే అందరికి తెలుసని, ఇప్పుడు శోభాశెట్టి రియల్‌గా ఎలా ఉంటుందో చూస్తారని అన్నది. అయితే వెళ్లిన వారంలోనే తన రియల్ బిహేవియర్‌ని చూసి‌ బిగ్ బాస్ ఆడియన్స్ బెంబేలెత్తిపోయారు. శోభాశెట్టి రియల్ బిహేవియర్‌ కంటే.. కార్తీకదీపంలో మోనితనే వందరెట్లు బెటర్ అనేట్టుగా తన వరస్ట్ బిహేవియర్‌తో నెగిటివిటీ మూటకట్టుకుంది శోభాశెట్టి. కార్తీకదీపం సీరియల్‌తో సంపాదించిన మంచి పేరునంతా పోగొట్టేసుకుంది శోభాశెట్టి.

ఈ సీజన్ లో మొదటి అయిదు వారాల్లోనే ఎలిమినేట్ కావాల్సిన శోభాశెట్టిని బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుకుంటు వచ్చారని, అందుకే తనని బిగ్ బాస్ దత్తపుత్రిక అని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. శోభాని ఎలిమినేషన్ నుంచి కాపాడటానికి‌ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌‌లని వరుసగా ఎలిమినేట్ చేయడంతో పాటు శోభాని ఏకంగా టాప్-7 కంటెస్టెంట్ చేశారు. దీంతో బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీజన్-7 లో తన వరస్ట్ బిహేవియర్‌గా ఆడియన్స్‌తో ఛీ కొట్టించుకున్న శోభాశెట్టి.. టాప్-7 కంటెస్టెంట్‌గా నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయిదోవారంలోనే ఎలిమినేట్ కావాల్సిన శోభాని పద్నాల్గవ వారం వరకు ఎలిమినేట్ చేయకుండా ఉన్నారు. ఇక పద్నాల్గవ వారంలో ఎలిమినేట్ అయిన శోభాశెట్టిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూనే ఉన్నారు హేటర్స్. ఎప్పుడో ఐదోవారంలో ఎలిమినేట్ కావాల్సిన మిమ్మల్ని.. పద్నాలుగు వారాల వరకూ ఉంచారంటే.. అగ్రిమెంట్ ఏదైనా జరిగిందా? అంటే.. అదేంలేదని చెప్పింది శోభాశెట్టి. తనని హేట్ చేసిన వాళ్లతో పాటు అభిమానించిన వాళ్ళు కూడా ఉన్నారని, అందుకే పద్నాలుగు వారాలు తను హౌస్‌లో ఉండగలిగానని చెప్పింది శోభాశెట్టి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.