English | Telugu
బిగ్ బాస్ తర్వాత మా మొదటి శుభవార్త!
Updated : Dec 26, 2023
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియాంక జైన్. 'జానకి కలగనలేదు' సీరియల్ లో అమర్ దీప్ తో కలిసి చేసిన ప్రియాంక తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. సొంతూరు బెంగుళూరు. తెలుగు టీవీ సీరియల్స్ లో అవకాశం రావడంతో హైదరాబాద్ కి వచ్చిన ఈ భామ.. తెలుగుని నేర్చుకుంది. ఇక్కడ తను నటించిన మరో సీరియల్ శివ్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో పొట్టి పిల్లగా అడుగుపెట్టిన ప్రియాంక గట్టిపిల్లగా టాప్-5 కి చేరుకుంది. సీరియల్ బ్యాక్ గ్రౌండ్ నుండి సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన వారిలో అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి, పూజామూర్తి, అంబటి అర్జున్ ఉన్నారు. ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన అశ్వినిశ్రీతో గొడవకి దిగడంతో ప్రియాంక కాస్త నెగెటివిటి సంపాదించుకుంది. హౌస్ లో ఎక్కువ టైమ్ కిచెన్ లో ఉన్న ప్రియాంకని వంటలక్క అని కూడా అనేవారు. అయితే టాస్క్ లలో కూడా బాగా ఆడేసరికి బిగ్ బాస్ ఫినాలే వీక్ లో తన జర్నీ వీడియో చూపిస్తూ.. పొట్టిపిల్లవి కాదు గట్టిపిల్లవి నువ్వు అంటు చెప్పాడు. హౌస్ లో అమర్ దీప్, శోభాశెట్టిలతో ఎక్కువ సమయం గడిపిన ప్రియాంకని గ్యాంగ్ లీడర్ అని బయట అనేవాళ్ళు.
ఎందుకంటే అమర్, శోభాశెట్టి ఇద్దరు ప్రియాంక ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఇక నామినేషన్ లో అందరు కలిసి గ్రూప్ గా నామినేట్ చేయడం, ప్రతీ టాస్క్ లో ఫౌల్ ఆడటం, అమర్ కి సపోర్ట్ చేయడం వల్ల ప్రియాంక వెనుకపడిపోయింది. ఇక హౌస్ లో ఎలిమినేషన్ లో ఉన్నా తనకంటే అన్ డిజర్వింగ్ వాళ్ళు ఎక్కువ ఉండటంతో ప్రియాంక టాప్-5 కి చేరుకుందనేది వాస్తవం. అయితే పద్నాలుగవ వారంలో శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది.
ప్రియాంక, శివ్ కలిసి 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో మోస్ట్ పాపులర్ వీడియోలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ కి వెళ్ళేముందు ప్రియాంక మేకోవర్ అనే వ్లాగ్ అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ' బిగ్ బాస్ తర్వాత మా మొదటి శుభవార్త' అంటూ అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ లో.. వాళ్ళిద్దరు కలిసి ప్రేక్షకులకి ఒక శుభవార్తని చెప్పారు. ఇప్పటివరకు లివింగ్ లో ఉన్న శివ్, ప్రియాంక కలిసి త్వరలో అంటే 2024 లో పెళ్లి చేసుకుంటున్నారంట. ప్రియాంక మాట్లాడుతూ.. పెళ్ళి అనేది ప్రతీ అమ్మాయికి ఒక కల. దీనికోసం ఎంతగానో ఎదురిచూస్తుంటారు. ఎవరిని చేసుకోవాలి. పెళ్ళి తర్వాత ఫ్యూచర్ ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు అమ్మాయిలకి ఎదురవుతాయి. నాకు శివ్ దొరికాడు. బాగా చూసుకుంటున్నాడు. మేం ఇప్పటికి ఎప్పటికి కలిసే ఉంటాంమంటూ చెప్పింది. కాగా ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ వైరల్ గా మారింది.