English | Telugu

Eto Vellipoindhi Manasu: వాళ్ళ శోభనం గదిలో బ్లూటూత్ పెట్టిన మాణిక్యం.. అంతా తెలిసిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 56 లో.. మాణిక్యం పూలగంపతో ఇంటికొచ్చి తన భార్య సుజాతకి రూమ్ అంతా డెకరేట్ చేయమని చెప్పగా.. ఎందుకని తను అడుగుతుంది. వాళ్ళిద్దరికి శోభనమని మాణిక్యం అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నాన్న ఇవన్నీ ఎందుకు..నేను మానసికంగా స్థిరంగా లేనని రామలక్ష్మి అంటుంది. అలా ఎప్పుడంటారో తెలుసా అమ్మ.. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నప్పుడే మానసికంగా స్థిరంగా లేరని అంటారు.. అంటే మీరు నిజంగా పెళ్ళి చేసుకోలేదా.. నటిస్తున్నారా అని మాణిక్యం అంటాడు‌.

అదంతా నీ భ్రమ నాన్న.. నాకు ఇష్టమే కానీ నేను కాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నానని మాణిక్యంతో రామలక్ష్మి అంటుంది. కానీ నేను తీసుకోవాలనుకువోడం లేదని సీతాకాంత్ ఎంట్రీ ఇస్తాడు. ఇక కాసేపు మాట్లాడి రామలక్ష్మిని ఒప్పిస్తాడు. ఇక శోభనం గదిలోకి వెళ్ళిన రామలక్ష్మిని కూర్చోబెట్టి మాట్లాడతాడు సీతాకాంత్. ఎలా జరిగిన మన పెళ్ళి జరిగింది కాబట్టి మనం కలిసి ఉండాల్సిందే అని సీతాకాంత్ అనగానే.. సర్ అని రామలక్ష్మి ఏదో మాట్లాడుతుండగా తనని మాట్లాడవద్దని ఆపుతాడు. ఆ తర్వాత గదిలోని అద్దం దగ్గరకి వెళ్ళి ‌. . మన మాటలన్నీ మీ నాన్న వింటున్నాడు అని రాస్తాడు‌. ఇక బెడ్ కి ఉన్న బ్లూటూత్ డివైస్ ని సీతాకాంత్ చూపిస్తాడు. ఇక ఆ తర్వాత రామలక్ష్మి కూడా సీతాకాంత్ లాగా మాట్లాడుతుంది‌. మాణిక్యం వేసిన ప్లాన్ ని తెలుసుకున్న ఇద్దరు అలాగే నటిస్తారు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మనం కలిసుండాలని సీతాకాంత్ అనగానే.. అవునహ సర్ కానీ మా నాన్న అసలు నమ్మట్లేదని రామలక్ష్మి అంటుంది. మీ నాన్న రాక్షసుడు కంత్రీగాడు అందుకే అడ్డమైన ఆలోచనలన్నీ ఉంటాయని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మాణిక్యం తన చెవిలోని బ్లూటూత్ తీసేస్తాడు.

ఇక మరుసటిరోజు ఉదయం వాళ్ళ గదిలోని బ్లూటూత్ తీయడానికి కంగారుపడతాడు మాణిక్యం. మెల్లిగా వాళ్ళ గదిలోని బ్లూటూత్ ని మాణిక్యం తీసుకొని వస్తుండగా సీతాకాంత్ చూస్తాడు. నీ దొంగబుద్ది నాకు తెలుసని మాణిక్యంతో సీతాకాంత్ అనగానే.. మెల్లిగా మాట్లాడు అల్లుడు అని మాణిక్యం అంటాడు. ఏంటి మెల్లిగా మాట్లాడేదని గట్టిగా అరుస్తాడు సీతాకాంత్. దాంతో ఇంట్లోని వాళ్ళంతా వస్తారు. ఏమైందని రామలక్ష్మి వాళ్ళ అమ్మ అడుగగా.. మా శోభనం గదిలో బ్లూటూత్ పెట్టాడని సీతాకాంత్ అంటాడు‌. దాంతో అందరు షాక్ అవుతారు. ఇక సీతాకాంత్, రామలక్ష్మి కలిసి మాణిక్యాన్ని తిడతారు. ఇలాంటి వాడింట్లో నేనుండను.. నాతో వస్తావా ఇక్కడుంటావా రామలక్ష్మి అని సీతాకాంత్ అనగానే.. నా భర్త ఎక్కడుంటే అక్కడే అని రామలక్ష్మి కూడా వచ్చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి సీతాకాంత్ వారింటికి వెళ్తారు. అక్కడ గుమ్మంలో ఎదురుగా శ్రీలత ఉంటుంది. వల్లీ అంటూ శ్రీలత పిలిచేసరికి ఇంట్లోని వాళ్ళంతా గుమ్మం దగ్గరకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.