English | Telugu

'కత్తిలా ఉంది పాప' అంటూ ఇంద్రజని కామెంట్‌ చేసిన నరేష్!

జబర్దస్త్ మళ్ళీ పుంజుకుంటోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎంట్రీలోనే ఆది, న‌రేశ్‌ల‌ను ఒక‌త‌ను ఒక బుల్లెట్ బైక్ మీద స్టేజి మీద‌కు తీసుకువ‌చ్చాడు. బండికి అడ్డంగా నిల్చున్న న‌రేశ్‌తో, "కొత్త‌బండి అంట‌. నిమ్మ‌కాయ అనుకొని తొక్కేసినా తొక్కేస్తాడు" అని పంచ్ వేశాడు ఆది. న‌రేశ్ ఏయ్ అని ప‌క్క‌కు జ‌ర‌గ‌గా, అంద‌రూ ఆ పంచ్‌కు విర‌గ‌బ‌డి న‌వ్వేశారు.

ఆదిని "నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్?" అని అడిగాడు న‌రేశ్‌. "అవ్వాలిరా" అన్నాడు ఆది. "ఎక్కడవ్వాలి, ఇంకెన్న‌వ్వాలి.. అరే.. సేల్స్ మాన్ కి కూడా ఒక టార్గెట్ ఉంటుంది, నీ టార్గెట్ ఎంతో చెప్పరా" అని న‌రేశ్ అడ‌గ‌డంతో, అందరూ నవ్వేశారు. తర్వాత వాళ్ల ప‌క్క‌నుంచి ఇంద్రజ, పవిత్ర "ఏ చిలిపి కళ్ళలోన కలవో" అనే సాంగ్ వస్తుండగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

వెంటనే నరేష్ వాళ్ళ వైపు తిరిగి "పాప కత్తిలా ఉంది.." అని ఇంద్రజను అనేసరికి, ఆమె సీరియస్ గా నరేష్ వైపు ఒక లుక్ ఇచ్చింది. "ఏంటి అంత సీరియస్ గా చూసింది?" అని ఆదిని అడిగాడు న‌రేశ్‌. "ఆవిడ అలా చూస్తదనే ఆ డైలాగ్ నీకు ఇచ్చా" అన్నాడు ఆది. తర్వాత రాకెట్ రాఘవ నిజాయితీ గల ఒక భర్తగా భార్య ఎలా చెప్తే అలా నడుచుకునే వాడిగా చేసిన స్కిట్ ప్రోమో చాలా బాగుంది.