English | Telugu

ఢీ ఫినాలే నుంచి  ప్రియమణి, శేఖర్ మాస్టర్‌ని తప్పించిన మల్లెమాల.. అసలేం జరిగిందంటే!


బుల్లితెరపై వచ్చే టీవీ షోలలో ఢీ షోకి ఉండే క్రేజే వేరు.‌ ఇందులో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులకి ఎంతో మ‌ంది ఫ్యాన్స్ ఉన్నారు. ఢీ జోడీలో ప్రదీప్ మాచిరాజు యాంకర్, జడ్జ్ లుగా ప్రియమణి, శేఖర్ మాస్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు రిలీజైన ప్రోమోలో శేఖర్ మాస్టర్, ప్రియమణి కనపడలేదు. దీంతో ఇప్పుడు అందరూ దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.

ఢీ షోలో డ్యాన్సర్స్ డ్యాన్స్ కంటే కూడా శేఖర్ మాస్టర్, ప్రియ మణి ల జడ్జిమెంట్ కే ఎక్కువ ఆదరణ అని అనడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. వీరిద్దరి జడ్జిమెంట్, హైపర్ ఆది పంచ్ ల కోసమే ఈ షోని ఎక్కువ మంది చూస్తారనేది నిజం. అయితే ఏమైందో తెలియదు గానీ ఈ రోజు రిలీజైన ప్రోమోలో ప్రియమణి, శేఖర్ మాస్టర్ కనపడకుండా ఇద్దరు కొత్త జడ్జ్ లు వచ్చినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళేవరు? ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే వచ్చారా? లేక మొత్తంగా ఉంటారా అనే ప్రశ్నలు ప్రేక్షకులలో నెలకొన్నాయి. శేఖర్ మాస్టర్ , ప్రియ మణి లేకుండా ఈ షో ఎంతమంది చూస్తారంటూ ఫ్యాన్స్ ఇప్పటికే ప్రోమో కింద కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మరి ఇందులో నిజం ఎమిటనేది తెలియదు.

ఢీ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్స్ వెలుగులోకి వచ్చారు. ఢీ షో మేకర్స్ పల్లెటూరిలోని యువతీ, యవకులలోని ట్యాలెంట్ ని గుర్తుచేస్తూ వరంగల్ వారియర్స్, కరీంనగర్ వారియర్స్ హైదరాబాద్ వారియర్స్ అంటు టీమ్ లుగా విభజిస్తూ ఒక్కో రౌండ్ లో మెరుగైన ప్రదర్శన ఉన్నవారిని తీసుకుంటూ డ్యాన్స్ మీద ఆసక్తిని కలుగజేస్తుంది. అయితే హైపర్ ఆది, దీపిక పిల్లి, సిరి హనుమంత్, మహేశ్ విట్ట ఇంకా కొంతమంది ఫేమస్ సెలబ్రిటీలని ఈ టీమ్ లకి కెప్టెన్స్ గా చేసి షోకి ఫుల్ క్రేజ్ వచ్చేలా చేసారు. అయితే ఇప్పుడు షోకి ప్రియ మణి, శేఖర్ మాస్టర్ రాలేదనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.