English | Telugu
'యూ ఆర్ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌస్'!
Updated : Oct 30, 2022
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు కంటెస్టెంట్స్ అందరు గెలవడానికే ఆడతారు. కాగా ఇలాంటి టాస్క్ ఫిజికల్ గేమ్ అయితే, హౌస్ మేట్స్ కి కచ్చితంగా గొడవలు, తోపులాటలు జరుగుతుంటాయి. అయితే నిన్న మొన్నటి దాకా ఉత్కంఠభరితంగా సాగిన టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన ఫిజికల్ గొడవలు కాస్త హీటెడ్ వాతావరణాన్ని తలపించాయి.
కాగా శనివారం నాగార్జున వచ్చి రాగానే ఒక్కో కంటెస్టెంట్ చేసిన తప్పులను చెబుతు, గట్టిగా తిట్టాడు. అయితే ఇందులో రేవంత్ గురించి"నువ్వు ఆటని ఒక యుద్ధంలాగా ఆడుతున్నావ్. నీకు ఒక వీడియో చూపిస్తా" అని వీడియో ప్లే చేసి అందరికి చూపించాడు నాగార్జున. ఆ వీడియోలో రేవంత్ టాస్క్ లో భాగంగా గీతుని, కీర్తి భట్ ని కిందకి తోసుకుంటూ వెళ్ళడం ఉంది.
ఆ వీడియో చూపించిన తర్వాత నాగార్జున, " రేవంత్ ఎందుకు అంత అగ్రెసివ్ గా ఆడుతున్నావ్?ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నావ్. ఒక అగ్ని పర్వతం లాగా కన్పిస్తున్నావ్. ఆట అంటే కసి ఉండొచ్చు గాని మరీ ఇతరులను నెట్టేసి వెళ్లి ఆడేంతనా!" అని అన్నాడు. తర్వాత ఒక వైపు పొగుడుతు, మరో వైపు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "గేమ్ లో అంతలా ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే కాని ఎదుటివారిని గాయపరిచి, గెలిచేంతలా వద్దు" అని చెప్పాడు.
"యూ ఆర్ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. కాని గేమ్ లో అగ్రెసివ్ గా కాకుండా కూల్ గా, మైండ్ తో ఆలోచించి చూడు. సరిపోతుంది " అని నాగార్జున చెప్పాడు. "ఒకే సర్. తప్పకుండా" అని రేవంత్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత "నువ్వు, టాస్క్ లో ఇనయా గేమ్ పట్ల చూపిన ప్రతిభ ఫెన్టాస్టిక్. రేవంత్ చేపలు తీసుకురాగా, ఇనయా ప్రొటెక్ట్ చేసే పద్దతి సూపర్ అసలు. నీ బుట్ట దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు" అని నాగార్జున పొగిడేసాడు ఇద్దరిని.