English | Telugu
నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారు
Updated : Oct 31, 2022
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తలో బాగానే కష్టపడ్డాడు సూర్య. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత ఫెమినిస్ట్ అని చెప్పి కొన్నిసార్లు ఆడవాళ్లకు సపోర్ట్ కూడా చేశాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వచేసాడు. హౌస్ లోంచి వచ్చాక బీబీ కేఫ్ లో శివతో ఇంటర్వ్యూ జరిగింది. ఇక ఇనయతో లవ్ ట్రాక్ గురించి అడిగి సూర్యని ఇరుకున పెట్టాడు శివ. ఇనయాను మోటివేట్ చేయడానికి తనతో ఎక్కువగా ఉన్నాను, మాట్లాడాను అని సూర్య చెప్పాడు. మొదట్లో సురోహిగా, తర్వాత సునాయాగా ఆడావ్ అలా ఎందుకు సూర్యలా ఆడొచ్చు కదా అనేసరికి "నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారు" అని బాధపడ్డాడు.
మరి ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు అని కొన్ని మీమ్స్ చూపించాడు. బిగ్‌బాస్ హౌజ్ లో సూర్య స్టార్టింగ్ లో ఫెమినిస్ట్ అని చెప్పి ఆ తర్వాత అమ్మాయిలకి ఫ్రీ హగ్స్ ఇవ్వడం, ఇనయా లవ్ ట్రాక్ గురించి కొన్ని మీమ్స్ చూపించాడు శివ. "మీమ్స్ చేసే వాళ్ళు వంద చేస్తారు" అన్నాడు సూర్య. ఇవి అసలు పట్టించుకోను అని అన్నాడు.