English | Telugu
అలా చేస్తే తనతో చెప్పమని శివాజీని రిక్వెస్ట్ చేసిన నాగార్జున!
Updated : Oct 29, 2023
బిగ్ బాస్ సీజన్-7 భారీ స్థాయిలో క్రేజ్‌ని పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్స్ ఇచ్చే కంటెంట్. అయితే హౌస్‌లో ఇప్పటికి ఏడు వారాలు పూర్తయ్యాయి. మరి ఎనిమిదో వారం నామినేషన్‌లో ఉన్నవాళ్ళలో ఎవరు వెళ్తారనే ఆసక్తి ఉండగా శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.
హౌస్‌లో నామినేషన్లు అంటే ఎందుకంత ఫుల్ స్వింగ్ అవుతున్నారంటూ నాగార్జున ఏకి పారేశాడు. ఇక బెడ్ రూమ్‌లో యావర్, రతికలు ఉన్నప్పుడు శివాజీ వారితో మాట్లాడిన మాటలని నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. ఎవరో ఒకరిని కొట్టి వెళ్తానని అన్నావ్. ఎవరు శివాజీ అని నాగార్జున అడిగాడు. ‘అదేం లేదు బాబు గారు.. నా వల్ల కావట్లేదండి. నామినేషన్‌లో ఒక్కొక్కరు హీరోలుగా ఫీల్ అయిపోయి ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఓదార్పు యాత్రలు.. ఇవన్నీ నావల్ల కావట్లేదు సర్. పోనీ చెప్దామంటే మళ్లీ నా మీద ఏం ప్లాన్ చేస్తారో’ అని శివాజీ అన్నాడు. మాకు నీ మీద నమ్మకం ఉంది శివాజీ.. తప్పు జరిగితే చెప్పు. మీరు చెప్తేనే కదా తెలిసేదని నాగార్జున అనగా.. ‘చెప్తానండి. ఈ ఒక్క వారం చూసి ఏదో ఒకటి చేస్తానండి’ అని శివాజీ అన్నాడు.
నామినేషన్‌లో ఇలా హైపర్ అవ్వకూడదు. వ్యాలిడ్ రీజన్ మాట్లాడాలని, వీకెండ్‌లో బాబుగారు వచ్చినప్పుడు నార్మల్‌గా ఉండాలని ప్రశాంత్‌కి చెప్పాను. యావర్‌తో కూడా ఇదే చెప్పానని శివాజీ అనగా.. వాళ్ళిద్దరికే చెప్తావా అని నాగార్జున అడిగాడు. లేదండి..ఆట సందీప్ డల్ అయిపోయాడు. పిలిచి మాట్లాడాను. వాడు హౌస్ నుండి వెళ్ళిపోతానంటే గంట సేపు మాట్లాడానని శివాజీ అన్నాడు. ప్రతీసారీ వెళ్ళిపోతా అని అనొద్దు, బయట మనం చూస్తుంటాం కదా అని నాగార్జున అనగా.. బయట అయితే కొట్టేసేవాడిని ఇది హౌస్ కాబట్టి ఇక్కడ రూల్స్‌కి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఇలా ఉన్నాను సర్ . ఇంకొక వారంలో వాళ్ళు మారకపోతే చెప్తాను సర్ అని శివాజీ అన్నాడు. ఏదైనా ఉంటే నాకు చెప్పు కానీ వెళ్ళిపోతానని మాత్రం అనకు అని శివాజీని నాగార్జున రిక్వెస్ట్ చేశాడు.