English | Telugu

అమర్‌ దీప్‌... పల్లవి ప్రశాంత్‌ అంటే ఎందుకంత చిన్నచూపు? 

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో ఊహించని మలుపులతో అలరిస్తుంది. కొత్త కథేం కాదు.. గత ఏడు వారాల నుండి సాగుతున్న కథే ఇది.. వరుసగా ఏడుగురు అమ్మాయిలు బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి ఎలిమినేటెడ్‌ అవ్వడమనేది ఈ సీజన్‌-7లోనే ఉంది. అయితే ఇలాంటి వాటి మధ్య ఈ వారం పెద్ద ట్విస్ట్‌ ఇస్తున్నాడా బిగ్‌ బాస్‌ అనేది తెలియాల్సి ఉంది.

అయితే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చీ రాగానే గౌతమ్‌ కెప్టెన్‌గా గెలిచినందుకు కంగ్రాట్స్‌ చెప్పాడు. ఆ తర్వాత అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. ఇక ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్‌ని లేపి వాళ్ళ ఆటతీరు, మాటతీరు చూపిస్తూ వాత పెట్టాడు నాగార్జున. హౌస్‌లో ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ రతికకి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లోకి గతాన్ని తవ్వుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి వచ్చావా? నామినేషన్‌లో లేవనే ధీమానా లేక భయం లేదా అని నాగార్జున అడిగేసరికి.. అదేం లేదు సర్‌. ఇకనుండి చూడండి, నా ఆటేంటో చూపిస్తానంటూ రతిక ప్రామిస్‌ చేసింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ అంటే నీకెందుకు అంత చిన్నచూపు అమర్‌ దీప్‌ అని మొదలుపెట్టాడు నాగార్జున.

అమర్‌ దీప్‌ దానికి మెలి తిరుగుతూ.. తనలోని స్వాతిముత్యం కమల్‌ హసన్‌ని బయట పెట్టాడు. నాకేం తెలియదు సర్‌. ఆ హీట్‌ మూమెంట్‌లో అలా మాట్లాడేశానని అమర్‌ అన్నాడు. హౌస్‌లో ఎవరైనా బూతు మాట్లాడితే నువ్వు ఊరుకోవు కదా ప్రియాంక.. ఆరోజు శోభా-భోలేల మధ్యకెళ్ళి మరీ బూతు మాట్లాడాడని అన్నావ్‌. మరి పల్లవి ప్రశాంత్‌ని ‘ఏరా నా కొడకా’ అని అమర్‌ దీప్‌ అంటే నీ రక్తం మరగలేదా అని ప్రశ్నించాడు. ఇక ప్రియాంక తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో చక్కగా కవర్‌ చేసుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.