English | Telugu

కంటెస్టెంట్స్ కి నాగార్జున మాస్ వార్నింగ్.. మాములుగా లేదుగా!

బిగ్ బాస్ సీజన్-7 మొదలయి రెండు వారాలు కావొస్తుంది. అయితే ప్రేక్షకులకు వారంలో జరిగే ఎంటర్టైన్మెంట్ కంటే శనివారం వచ్చే నాగార్జున ఎపిసోడ్ గురించి ఎంత ఎక్కువగా వెయిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ విమర్శంచడం, చేసిన మంచిని ప్రసంశించడం చేస్తుంటాడు. అయితే ఈ వారం హౌజ్ లో గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటిపై నాగార్జున ఎలా స్పందిస్తాడోననే కూతుహలం అందరిలోను నెలకొంది.

నాగార్జున శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఫుల్ ఆన్ ఫైర్ మీద ఉన్నాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ కి మాస్ వార్నింగ్ మాములుగా లేదు. కింగ్స్ మీటర్ అంటూ హౌజ్ లో జరిగేఇన ఆటలో పర్ఫామెన్స్ బాగున్న వారికి గ్రీన్, అవేరేజ్ గా ఉన్నవాళ్ళకి ఆరెంజ్, అసలు పర్ఫామెన్స్ లేని వారికి రెడ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చాడు. శివాజీ అటతీరుని మెచ్చుకుని గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత నామినేషన్ లలో ప్రశాంత్ , అమర్ దీప్ మధ్యకి జరిగిన గొడవ గురించి అడిగాడు‌. అందులో అందరూ ఎక్సపెక్ట్ చేసినట్టుగానే ప్రశాంత్ కి సపోర్ట్ గా నాగార్జున మాట్లాడాడు. షకీ అమ్మ గురించి మాట్లాడుతూ.. మీరు ఎప్పుడు ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతారు. యాక్టర్స్ కి ఏజ్ కీ సంబంధం లేదని షకీ అమ్మకి నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.

ఇక ఆ తర్వాత రైతుబిడ్డ ప్రశాంత్ అటతీరుకి గ్రీన్ ఇచ్చి పాజిటివ్ గా మాట్లాడడు. కానీ ప్రశాంత్ కి నాగ్ పంపిన మొక్క వాడిపోవడంతో కొంచెం ఘాటుగా రియాక్ట్ అయి, ' ఒక రైతుబిడ్డ అని చెప్పుకుంటావ్. ఒక మొక్కని చూసుకోలేకపోయావ్' అని అన్నాడు. ఇక ఆ తర్వాత మరొక మొక్క పంపిస్తున్నాను. అది ఇలాగే జరిగేతే వాళ్ళు నామినేషన్ లలో అన్నది నిజమని నేను నమ్ముతానని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత గౌతమ్, ప్రిన్స్ యావర్ ల మధ్య జరిగిన గొడవలో గౌతమ్ తప్పుగా మాట్లాడావని మందలించాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ కి గౌతమ్ కృష్ణ చేత సారీ చెప్పించాడు నాగార్జున. ఇక పర్ఫామెన్స్ వైజ్ గా శుభశ్రీ, ప్రియాంక, దామిని,శోభ, తేజల ఆట బాగోలేదంటూ వాళ్ళకి రెడ్ కలర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆటసందీప్ సంచాలక్ గా బాగా చేశాడని చెప్పాడు. రతిక తన మొండి ప్రవర్తన గురించి నాగార్జున ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇలా కంటెస్టెంట్స్ హౌజ్ లో ఉన్న విధానాన్ని చూసి నాగార్జున ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నాడు.