Read more!

English | Telugu

అమర్ దీప్, ఆట సందీప్ ల దొంగాట బయటపెట్టిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రేక్షకులకు బాగా ఇంట్రెస్ట్ కలిగించే ఎపిసోడ్ శనివారం నాటి ఎపిసోడ్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వారమంతా బిగ్ బాస్ హౌజ్ లో‌ జరిగే గొడవలు, ఏ కంటెస్టెంట్ ఏం తప్పు చేశారో చూపిస్తూ ఒక్కొక్కరికి నాగార్జున వాతలు పెడుతుంటాడు.

హౌజ్ లో మొదటి నుండి సీరియల్ లో కలిసి నటించిన అమర్ దీప్- ప్రియాంక జైన్ లకి అదనంగా శోభా శెట్టి, ఆట సందీప్ కలిశారు. ఇక ఆట సందీప్ తన చేజేతులా తన ఆటని, మాట తీరుని నాశనం చేసుకుంటున్నాడు. అమర్ దీప్ తో ఎక్కువ సమయం గడుపుతూ వారేం చెప్తే అదే వేదం అన్నట్టుగా చేస్తున్నాడు. నామినేషన్లో లేడు కాబట్టి సరిపోతుంది కానీ ఉంటే అతడికి అసలు ఓటింగే ఉండదు. ఎందుకంటే ప్రతీవారం సంచాలక్ గా పక్షపాతంగా ఉంటూ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక ఎప్పుడు చూడు గ్రూప్ గా ఆడట్లేదని అంటూనే అదే పంథాలో వెళ్తున్న అమర్ దీప్, ఆట సందీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లని ఉతికారేశాడు నాగార్జున.

ఇక ఐదవ వారంలో అమర్ దీప్-ఆట సందీప్ కలిసి ఒక జంటగా ఆడిన విషయం తెలిసిందే. స్మైలీ టాస్క్ లో వీళ్ళిద్దరు కలిసి ఫౌల్ గేమ్ ఆడారని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత ఫ్రూట్ నింజా టాస్క్ లో అమర్ దీప్ లైన్ క్రాస్ చేసి బత్తాయిలు విసరడం, కిందపడిఉన్న బత్తాయిలని ఆట సందీప్ తీసుకొని జ్యూస్ చేయడం, ఇక బత్తాయి తొక్కని జ్యూస్ లో వేశాడని వారు చేసిన మూడు తప్పులని బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు నాగార్జున. ఆ తర్వాత రంగు పడుద్ది టాస్క్ లో ఆట సందీప్ వరెస్ట్ గేమ్ ప్లే అని, మీది తప్పు అయినా సరే ప్రియాంకతో ఆర్గుమెంట్ చేశావ్‌. ఇక అమర్ దీప్ ఇష్టమొచ్చినట్టు బొక్క అనొచ్చంటూ.. మీది బొక్కలో ఆట తొక్కలో జడ్జ్ మెంట్ అని నాగార్జున అన్నాడు. ఫైనల్ గా మీరిద్దరు స్మైలీ బడ్డీస్ కాదు క్రైమ్ బడ్డీస్ అంటు వారికి ఒక ముద్ర వేసేశాడు నాగార్జున.