Read more!

English | Telugu

జగతి సంతాప సభలో ఎండీ పదవిని రిజెక్ట్ చేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -888 లో.. రిషి మాట్లాడిన మాటల గురించి శైలేంద్ర, దేవయాని ఇద్దరు భయపడతారు. తన తల్లి చావుకి కారణం మనమే అని తెలిస్తే రిషి మనల్ని వదిలిపెట్టడని దేవయాని అంటుంది. మనకి సంబంధించిన చిన్న క్లూ దొరికినా ఆ వసుధారా మనల్ని రిషి ముందు దోషులుగా నిలబెడుతుందని అంటుంది. అవన్నీ ఆలోచించకు, నేను చేయాలిసింది నేను చేస్తానని దేవయానితో శైలేంద్ర అంటాడు.

మరొకవైపు మనకి నిజం తెలిసినా మనం చెప్పట్లేదు. దీనికి అంతటికి కారణం మా అయన అని రిషికి చెప్పేద్దామని వసుధరతో ధరణి అనగానే.. ఏమని చెప్తావ్. మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని వసుధార అడుగుతుంది. మొన్న మా అయన ఒక అతనికి డబ్బులు ఇచ్చి మాట్లాడడం నేను చూసానని ధరణి చెప్తుంది. డబ్బులు ఇస్తే అది సాక్ష్యమెలా అవుతుందని వసుధార అంటుంది. నేను సాక్ష్యాలతో రిషి సర్ కీ అన్ని నిజాలు తెలిసేలా చేస్తానని వసుధార చెప్తుంది. 

మరొక వైపు కాలేజీ లో జగతి సంతాప సభకి మహేంద్రని రమ్మని ఫణింద్ర పిలుస్తాడు. మహేంద్ర మొదట్లో రానని చెప్పినా గాని అందరు బలవంతపెడితే ఒప్పుకుంటాడు. ఇక రిషి కూడా కాలేజీకీ రానని అంటాడు. నా తరుపున వసుధారా వస్తుందని రిషి చెప్తాడు. మా అమ్మకి నేనెంత ఇష్టమో వసుధార కూడా అంతే ఇష్టమని రిషి చెప్తాడు. కాసేపటికి రిషి తన గదిలో జగతి ఫోటోని ఫోన్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడే వసుధార వచ్చి.. మొదటిసారి మీ భార్యగా కాలేజీకి వెళ్తున్నాను. మిస్సెస్ రిషేంద్ర భూషణ్ అని రిషి ఆశీర్వాదం తీసుకోబోతుంటే.. రిషి వద్దని చెప్పి, తనకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు.

ఆ తర్వాత అందరు జగతికి కాలేజీలో సంతాపం తెలియజేస్తారు. దాని తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇన్ని రోజుల్లో ఎండీ చైర్ ఎప్పుడు ఖాళీగా లేదు. రిషి తర్వాత జగతి కాలేజీ బాగా నడిపించిందని ఫణింద్ర జగతి గురించి గొప్పగా మాట్లాడతాడు. ఇప్పుడు ఎండీ సీట్ లో మహేంద్ర కూర్చుంటే బాగుంటుందని ఫణింద్రతో పాటుగా, మిగిలిన బోర్డు మెంబెర్స్ అంటారు.  ఇప్పుడు కూడా ఎండీ సీట్ నాకు దక్కదా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఎండీగా ఉండనని మహేంద్ర చెప్తాడు. నాకు ఇప్పుడు మీటింగ్ లో కూడా ఉండాలని లేదంటు మహేంద్ర వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.