English | Telugu
Bigg Boss Telugu 9: ప్యాక్ యువర్ బ్యాగ్ డీమాన్.. డోర్స్ ఓపెన్ చేసిన బిగ్ బాస్!
Updated : Nov 2, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో నాగార్జున వచ్చీ రాగానే సంజనకి క్లాస్ తీసుకున్నాడు. మాధురి, భరణిల మధ్య జరిగిన బిర్యానీ గొడవ గురించి డిస్కస్ చేశాడు. ఆ తర్వాత దివ్య కెప్టెన్ అయినందున తనకి కంగ్రాట్స్ తెలిపాడు.
ఆ తర్వాత డీమాన్ పవన్ ని లేవమని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత డోర్లు తెరవండి.. ప్యాక్ యువర్స్ బ్యాగ్ అంటూ డీమాన్ పవన్ కి నాగార్జున చెప్పడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. రీతూ చౌదరి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది. తన తప్ఫేం లేదు సర్ అని ఏడ్చేసింది.
మాధురి గారు నామినేషన్స్ అప్పుడు మీ ఇద్దరిదీ అన్ హెల్దీ బాండ్ అని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్‌ని అన్ హెల్దీ అని అనడానికి ఆమెకి ఏం హక్కు ఉందని అనిపించింది. కానీ.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే.. మీది ఖచ్చితంగా అన్ హెల్దీ బాండింగ్ అనే అనిపిస్తుందని నాగార్జున చెప్పాడు. నో సర్.. నో అని రీతు అన్నది. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది రీతూకి మాత్రమే కాదు.. హౌస్‌లో ఉన్న ఆడియన్స్‌కి.. చూసే ఆడియన్స్‌కి క్షమాపణ చెప్పమని డీమాన్ తో నాగార్జున అన్నాడు.
ఇక మోకాళ్లపై కూర్చున్నాడు డీమాన్.. నేను అలా చేసి ఉండకూడదు. ఫ్యూచర్‌లో రిపీట్ చేయను. మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తానని డీమాన్ క్షమాపణ చెప్పాడు. ఇదే మాట రీతూ చౌదరికి కూడా చెప్పు అన్నాడు నాగార్జున. దాంతో డీమాన్.. రీతూ చౌదరి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. ఓ పక్క రీతూ.. లే పవన్ అని అంటున్నా కూడా.. మోకాళ్లపైనే కూర్చుని ఆమె చేతుల్ని పట్టుకుని.. రీతూ.. సారీ.. నిన్ను తోసి ఉండకూడదు.. ఫ్యూచర్‌లో మళ్లీ ఇలా చేయనని మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పాడు డీమాన్.
ఇది లైఫ్ లెస్సన్ పవన్.. నీకోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు.. నీ క్యారెక్టర్‌కి సర్టిఫికేట్ ఇచ్చారు.. నువ్వు కూడా అవతల వాళ్ల క్యారెక్టర్‌పై నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలంటూ నాగార్జున చెప్పాడు. మరి డీమాన్, రీతూ మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.