English | Telugu

డిసెంబర్ 2 నుంచి సరికొత్తగా అలరించబోతున్న 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌'

ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' ఇప్పుడు 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌' పేరుతో ఒక సరికొత్త కార్యక్రమాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. 'ఆహా' టీమ్ అనిల్‌ రావిపూడితో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త ప్రోమోని రిలీజ్ చేసింది. ఈ షోలో ఆడియన్స్‌ ని ఇన్వెస్టర్స్ గా, కమెడియన్స్ స్టాక్స్ గా, అనిల్‌ రావిపూడి ఛైర్మన్‌ గా ఉన్నారు. ఈ సెటప్ అంతా కలిపి కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అని అనిల్ రావిపూడి ప్రోమోలో ఈ న్యూ ఎపిసోడ్ మెయిన్ థీమ్ చెప్పారు.

ఇక బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇది రొటీన్ షోస్ లా కాకుండా ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఒక కాన్సెప్ట్ ని ఇందులో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో జడ్జెస్ ఎవరూ ఉండరు. మార్క్స్ ఉండవు. ఈ షోకి వచ్చిన ఆడియన్స్ చేతికి ఫోన్లు ఇచ్చారు.. తమని బాగా ఎవరు ఎంటర్టైన్ చేసి కామెడీని పంచారో వాళ్ళని ఆడియెన్స్ ఎంపిక చేస్తారు. ఈ షోలో ఆడియన్స్ ని మెయిన్ రోల్ ప్లే చేస్తారన్నమాట.

ఇక మామూలు షోస్ లా ఎవరికి వాళ్ళు వచ్చి స్కిట్స్ చేసేసి వెళ్లిపోయే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఇందులో రౌండ్స్ ఉన్నాయి. రౌండ్ 1 స్టోరీస్ ఆఫ్ అట్లుంటది మనతోనే, ఇక రౌండ్ 2 సర్ప్రైజెస్ ఆఫ్ పదా చూసుకుందాం, రౌండ్ 3 మ్యాడ్నెస్ ఆఫ్ ఇచ్చి పడేస్తాం. ఈ రౌండ్స్ లో భాగంగా టంగ్ ట్విస్టర్లు, గేమ్స్ పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా "లాఫింగ్ స్టాక్ ఆఫ్ డే ఈజ్" పేరుతో ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ బట్టి విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇదీ టోటల్ గా కామెడీ షో యొక్క కాన్సెప్ట్. చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఆడియన్స్ కి పెద్ద పీట వేశారు. ఇక ఈ షోలో కమెడియన్స్ గా ఎక్స్ప్రెస్ హరి, సద్దాం, అవినాష్, వేణు వండర్స్ ఇలా అందరూ వచ్చి కామెడీ చేయబోతున్నారు. ఇక ఈ షో డిసెంబర్‌ 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ కావడానికి సిద్ధంగా ఉంది.