English | Telugu

మణికంఠ భార్య సంచలన పోస్ట్.. బిగ్ బాస్ నుంచి రాగానే విడాకులేనా?

బిగ్ బాస్ సీజన్-8 లో ఫస్ట్ వీక్ లోనే సెంటిమెంట్ కార్డుతో ఫేమస్ అయ్యాడు నాగ మణికంఠ. ప్రేరణ తన నామినేషన్ లో మణికంఠని ఓపెన్ అవ్వమని చెప్పగా.. తను తన వివరాలు చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అక్కడి నుండి అతడితో హౌస్ మేట్స్ కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే తాజాగా అతని భార్య చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటో ఓసారి చూసేద్దాం.

మణికంఠ భార్య ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిదంటు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే భార్యా,భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫొటోని కూడా షేర్ చేసింది. చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని శ్రీప్రియ ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లాంఛింగ్ డే నాడు.. మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య.. తనని ఇండియాకి వెళ్లిపొమ్మన్నదని భార్య, కూతురు ఉన్నా ఒంటరివాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే హౌస్‌లోకి వచ్చిన తరువాత మాత్రం.. తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు‌. అతని వీడియో చూసి ఆమె గురించి చాలామంది నెగిటివ్‌గా అనుకున్నారు. కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని భర్తని ఇండియాకి పొమ్మదనే మీనింగ్‌లో ఆ వీడియోను కట్ చేయడంతో.. అంతా నాగ మణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. కానీ హౌస్ లో ఓ సందర్భంలో నా వైఫ్ బంగారం అంటు చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏం లేవేమో అని అనుకున్నారంతా కానీ ఈ పోస్ట్ తో అది నిజమేనని స్పష్టమవుతుంది. మరి ఈ పోస్ట్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి‌.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...