English | Telugu

బజ్ ఇంటర్వ్యూలో మణికంఠ చెప్పిన నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-8( Biggboss 8 Telugu) లో ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చాడు. గతవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అవ్వగా ఈ వారం మణి బాబు ఎలిమినేషన్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

విన్ అవ్వాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. అసలు ఛీఫ్ అవ్వకుండానే బయటకెందుకు వచ్చారని యాంకర్ అడుగగా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని మణికంఠ చెప్పాడు. వాయ్యా.. అంటు యాంకర్ షాక్ అయ్యాడు. అది ఎంత పెద్ద కంటెంటో తెలుసా అంటూ.. నా పెళ్ళాం బిడ్డలు నాకు కావాలి.. నా రెస్పెక్ట్ నాకు కావాలి అంటు యాంకర్ చెప్తూ యాక్టింగ్ చేయగా మణికంఠ షాక్ అయ్యాడు. ఫస్ట్ వీక్ లో మీరు చెప్పిన ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ అయిదో వారం లేవు ఎందుకని అడుగగా.. బై డీఫాల్ట్ నేను ఇంతే అని మణికంఠ అన్నాడు.

గోరంత దాన్ని కొండంత చేస్తావని హౌస్ మేట్స్ అన్నారని యాంకర్ అడుగగా.. నేను రియాక్ట్ అయ్యే విధానం అలా ఉంటుంది. అసలు నువ్వు హౌస్ లో రామువో, రెమోవో, అపరిచితుడివో అర్థం కావట్లేదని యాంకర్ అనగానే.. మణికంఠ నవ్వేశాడు. ఇందాకటి నుండి పాజిటివ్స్ , పాజిటివ్స్ అంటున్నావ్.. నీ గురించి ఒక్క పాజిటివ్ థింగ్ చెప్పు అని యాంకర్ అడుగగా.. నేను నాలాగా ఉండటమే నా పాజిటివ్ థింగ్ అని మణికంఠ చెప్పాడు. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే నువ్వు బ్యాక్ స్టాప్(వెన్నుపోటు) పొడిచావని కొందరు అన్నారని అడుగగా.. ఇదైతే నేను ఒప్పుకోను అని మణికంఠ అన్నాడు.

హౌస్ లో ఎవరికైనా డబుల్ స్టాండ్స్(ఒకేసారి రెండు మాటలు) ఉన్నాయా అని యాంకర్ అడుగగా.. నిఖిల్ అని మణికంఠ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ అగ్రీ చేస్తాడు తర్వాత నో అంటాడని మణికంఠ చెప్పాడు. ఇక విష్ణుప్రియ-పృథ్వీల మధ్య ఏం ఉంది.. వన్ సైడ్ ఆ అని యాంకర్ అడుగగా.. టూ సైడెడ్ అని మణికంఠ చెప్పాడు. దాంతో అటు యాంకర్ తో పాటు ఇటు ఆడియన్స్ షాక్ అయ్యారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...