English | Telugu
న్యూస్ రీడర్ గా నా కెరీర్ గా స్టార్ట్ అయ్యింది!
Updated : Nov 22, 2022
ఆలీతో సరదాగా ప్రతీ వారం అలుపులేకుండా సాగిపోతున్న షో. ఇక ఈ వారం ఈ షోకి వక్కంతం వంశి, శ్రీవిద్య వచ్చారు. అసలు తన ప్రస్థానం ఎలా మొదలయ్యింది అనే ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పాడు వంశీ. "ఈటీవీతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకు అంటే ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలీనప్పుడు ఈటీవీలో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. ఎలా అంటే అప్పట్లో పేపర్ లో న్యూస్ రీడర్స్ కావాలని యాడ్ పడింది. మా నాన్న నన్ను ఎంకరేజ్ చేసి ఫోటో షూట్స్ చేయించారు.
తర్వాత లక్కీగా నేను సెలెక్ట్ అవడం నా వాయిస్, భాష స్పష్టంగా ఉండేసరికి న్యూస్ చదివించారు. అప్పటికి న్యూస్ రీడింగ్ అంటే ఒక ప్రొఫెషన్ అని కూడా నాకు తెలీదు. ఆ టైములో నాకు సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదు. అలా నా ప్రస్థానం న్యూస్ రీడర్ గా స్టార్ట్ అయ్యింది. తర్వాత ఈటీవీలో అప్పట్లో ఫణి అనే కామెడీ సీరియల్స్ రాసే ఒక రైటర్ ఉండేవారు ఆయన పేపర్ లో ఒక కటింగ్ చూసి అప్లై చేయమంటే దాసరి గారికి అప్లై చేసి ఇంటర్వూకి వెళ్లాను..అలా కల్యాణ ప్రాప్తిరస్తు మూవీ చేసాను కానీ అది కాస్తా కల్యాణ ఫ్లాప్తిరస్తు గా మిగిలిపోయింది. ఇంక హీరోగా చేయకూడదు అనుకున్నా. ఇక అప్పుడే నాలో రైటర్ ని మేల్కొలిపాను.
ఇప్పుడు నితిన్ తో ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాను..ఒక సాంగ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది." అని చెప్పారు వక్కంతం వంశీ.