English | Telugu
బ్రేక్ ఇచ్చినా భోజనం చేయకుండా డాన్స్ కంపోజ్ చేశారు..అంత డెడికేషన్ ఆయనది!
Updated : Nov 22, 2022
"డాన్స్ ఇండియా డాన్స్" షో కామెడీ విత్ డాన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో గాలోడు మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.
ఇక ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ " నేను బాబా మాస్టర్ కి ఫోన్ చేసి నా మూవీ టైటిల్ సాంగ్ కి మీరే డాన్స్ కంపోజ్ చేయాలి అన్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐతే ఎవరైనా రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతారు. కానీ మాస్టర్ మాత్రం ఇప్పటివరకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. మాస్టర్ కి టు నైట్స్ టైం ఇచ్చాం డాన్స్ కంపోజింగ్ కి..ఐతే ఆయన పని చేసినంత సేపు ఫుడ్ తినలేదు. తినమని చెప్పినా కూడా సుధీర్ అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మరి అతనికి డాన్స్ కంపోజ్ చేయడం మాటలు కాదు కదా అన్నారు. నేను కూడా అలా తినకుండా చేద్దామని అనుకున్నా. కానీ రెండో రోజే పడిపోయాను. దాంతో ఫుల్ గా తినేసి వెళ్లి డాన్స్ చేసాను." అని చెప్పాడు. ఇక సుధీర్ మాటలకు బాబా మాస్టర్ మాట్లాడుతూ "గాలోడు మూవీలో డాన్స్ కోరియోగ్రఫీ చేసాను.
ఎందుకంటే సుధీర్ ఐదేళ్ల క్రితం నాకు మాట ఇచ్చాడు. తన మూవీకి నేనే డాన్స్ కంపోజ్ చేయాలని. ఇన్నేళ్ళైనా మర్చిపోకుండా ఆ ఛాన్స్ నాకే ఇచ్చాడు సుధీర్. సుధీర్ ది చాలా మంచి మనసు..రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే అవకాశం రావడం అనేది ఇంపార్టెంట్ ..ఇలాంటి అవకాశం వలన ఎవరు, ఎంత ఎత్తుకు, ఎలా ఎదుగుతారో తెలీదు కదా" అని చెప్పాడు బాబా మాస్టర్.