English | Telugu
పెళ్లి గురించి క్లారిటీ ఎప్పుడొస్తుంది.. ఏంటి మీకు లవ్ స్టోరీ ఉందా?
Updated : Dec 6, 2023
ఫామిలీ నంబర్ 1 నెక్స్ట్ సండే ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా నవదీప్ వచ్చాడు. ఇక రాగానే హోస్ట్ రవికి కో-హోస్ట్ గా చేస్తున్న రౌడీ రోహిణి వచ్చి అల్లరల్లరి చేసి పారేసింది. "దీప్..దీప్ నువ్వంటే నా దిల్లో డిబ్ డిబ్" అంటూ కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. వెంటనే రోహిణి నవదీప్ నడిచిన చందమామ మూవీలో "ముక్కుపై ముద్దు పెట్టు" అని పాట పాడింది.
దానికి నవదీప్ నవ్వుతూ " ఈ పాట పడితే కాజల్ గుర్తొస్తుంది" అన్నాడు. ఇక తర్వాత ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రియల్ కపుల్స్ కొంతమంది నవదీప్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. సీద్విష్ణు కపుల్ లేచి " పెళ్లి గురించి ఎంత క్లారిటీ రావాలి మీరు పెళ్లి చేసుకోవాలంటే" అని అడిగారు తర్వాత యాంకర్ మృదుల వచ్చి "ఇంట్లో ఎవరూ లేనప్పుడు హూ ఆర్ యు" అని అడిగింది. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా విన్నాడు నవదీప్.
తర్వాత హోస్ట్ రవి వచ్చి "నవదీప్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా " అని అడిగాడు "ఎందుకు లేదు గురు" అని అడిగేసరికి "ఉందా మీకు" అంటూ రోహిణి వచ్చి అడగడంతో వెంటనే "లేదా మీకు" అంటూ ఠకీమని కౌంటర్ పంచ్ ఇచ్చేసాడు నవదీప్. ఇక నవదీప్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఆయన నటించిన ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే నవదీప్ ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు అని..దానికి ఆన్సర్ చెప్తూనే ఉంటాడు. టైం వచ్చినప్పుడు అవుతుంది.కానీ లాక్‌డౌన్ టైమ్‌లో తనకు బ్రేకప్ అయ్యిందని, దాని నుంచి బయటపడేందుకు థెరపీకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .ప్రస్తుతం తన మైండ్ అంతా కూడా ఇండస్ట్రీలో మంచి మంచి షోస్ చేయాలనీ ఉందంటున్నాడు నవదీప్.