English | Telugu
Krishna Mukundha Murari Today Episode : చేతులతో ఎత్తుకొని తీసుకెళ్ళిన మురారి.. గతం గుర్తురాకుండా ముకుంద చేయగలదా?
Updated : Nov 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -305 లో.. అవుటౌస్ లో కృష్ణ బిర్యానీ చేస్తుంటే ఆ స్మెల్ కి మురారి ఇంట్లో అందరిని తీసుకొని కృష్ణ వంట చేసే దగ్గరికి వస్తాడు. అలా అందరు రావడం చూసిన కృష్ణ హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ కూర్చొండి అందరికి చేస్తానని కృష్ణ చెప్తుంది. భవాని కి ఇష్టం లేకున్నా మురారి రమ్మని చెప్పాడని వచ్చి ఇబ్బందిగానే ఉంటుంది.
ఆ తర్వాత కాసేపు సరదాగా ఒక గేమ్ ఆడుకుందామా అని కృష్ణ చెప్పగానే.. మురారి సరే అంటాడు. ఆ తర్వాత ఎవరు ఏ ఐటమ్ కాడయిలో వేస్తారు. నేను చూడకుండా చెప్తానని కృష్ణ చెప్తుంది. అలా అందరు ఒక్కొక్క ఐటమ్ వేస్తారు. కృష్ణ ఎవరు ఏం వేసారో పర్ఫెక్ట్ గా చెప్తుంది. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్ అని మురారి అడుగుతాడు. తర్వాత చెప్తానని కృష్ణ చెప్తుంది. కృష్ణ బిర్యానీ రెడీ చేసి అందరికి వడ్డిస్తుంది. అప్పుడు మురారి నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావో చెప్తాను అన్నావ్ కాదా అని అనగానే.. వాళ్ళ వెనకాల ఉన్న అద్దం చూపించి అందులో చూసి చెప్పానని చెప్పగానే.. మీది చిన్న పిల్లల మెంటాలిటీ అని మురారి అంటాడు. ఆ తర్వాత ఇలాంటి బిర్యానీ నువ్వు వన్ మంత్ వరకు తినలేవ్ మురారి, ఎందుకు అంటే బెటర్ ట్రీట్ మెంట్ కోసం నిన్ను ముకుందని అమెరికా పంపిస్తున్నానని భవాని చెప్పగానే.. కృష్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ నిద్రపోకుండా భవాని అన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. మరొక వైపు ఉదయం కృష్ణ దగ్గరికి మధు వస్తాడు. కృష్ణ నిద్ర లేవకపోవడం చూసి ముట్టుకుని చూసేసరికి కృష్ణ హై ఫీవర్ తో ఉంటుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాడనికి వెళ్తాడు. అక్కడ మురారి ఉండడంతో మధు చెప్పకుండా వెనక్కి వస్తాడు. ఏంటి మధు చెప్పబోయి ఆగిపోయాడని వెళ్లి.. మధు ఏంటని మురారి అడుగుతాడు. మధు చెప్పకుండా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వెళ్లి చూసేసరికి.. తను హై ఫీవర్ తో ఉంటుంది. నాకు ఫీవర్ అని మీతో మధు చెప్పాడా అని కృష్ణ అనగానే.. తనకి ఫీవర్ అని నాకు ఎందుకు చెప్పట్లేదు. నేనే తెలుసుకోవాలని మురారి అనుకుంటాడు. డాక్టర్ గారు ఇంత ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ కీ వెళదామని కృష్ణకి చెప్పి.. కార్ 'కీ' కోసం లోపలికి వస్తాడు మురారి. ఆ తర్వాత డాక్టర్ గారికి ఫీవర్. హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నాను. అయిన నన్ను చూసుకోవడానికి వచ్చిన డాక్టర్ ని ఇక్కడ ఉంచకుండా అవుటౌస్ లో ఎందుకు ఉంచారని మురారికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ముకుందని కూడా తీసుకొని వెళ్ళమని మురారీతో భవాని చెప్తుంది. కృష్ణ, మురారి, ముకుంద హాస్పిటల్ కి వెళ్తారు. వాళ్ళ మధ్య ఈ ముకుంద ఎందుకని మధుతో రేవతి అనగానే.. ముకుంద ఏం చెయ్యలేదు. ఇప్పటికే మురారికి కృష్ణ గురించి డౌట్ వస్తుందని మధు చెప్తాడు.
హాస్పిటల్ కి వెళ్ళాక.. కార్ లో ఉన్న కృష్ణని ఎంత లేపిన లేవకపోవడంత కృష్ణని చేతులతో ఎత్తుకొని తీసుకెళ్దామనుకుంటాడు మురారి. నువ్వెందుకు హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు కదా అని ముకుంద అనగానే.. ఎందుకో తను నాకు దగ్గర మనిషి అనిపిస్తుందని మురారి అంటాడు. మురారికి గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణని హాస్పిటల్ లోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు మురారి. మరి మురారికి గతం గుర్తుకువస్తుందా? ముకుంద వాళ్ళిద్దరిని ఒక్కటి కాకుండా ఆపగలదా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.