English | Telugu

నేరస్థులని పట్టుకుంటానని ప్రామిస్ చేసిన స్పెషల్ ఆఫీసర్.. రొమాంటిక్ గా వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -911 లో.. జగతి గురించి ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి స్పెషల్ ఆఫీసర్ అయిన ముకుల్ వస్తాడు. ఆ తర్వాత జగతిని రిషి కలవడానికి వెళ్తున్న విషయం నాకు మా అమ్మకి తప్ప, ఎవరికీ తెలియదని రిషి అనగానే.. మరి ఈ విషయం వేరేవాళ్లకి ఎలా తెలిసింది? జగతి మేడమ్ ఫోన్ ని ట్రాప్ చెయ్యమని పంపించామని ముకుల్ అంటాడు.. ఆ తర్వాత దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ కూడా మొదటగా మన అనుకున్న వాళ్ళతో మొదలు పెట్టాలి సర్ అని వసుధార అంటుంది.

ఆ తర్వాత అలా ఎందుకు వసుధారా? ఆ అవసరం లేదు ఇంట్లో వాళ్ళు అంత సరదాగా ఉంటామని దేవయాని అంటుంది. ఎందుకు అలా అంటారు. రాజ్యం కోసం అన్నదమ్ములు పోటీ పడలేదా? ఇంట్లో వాల్లే నేరస్తూలని చాలా సందర్భాలలో వినలేదా అని వసుధార అనగానే దేవయాని శైలేంద్ర ఇద్దరు టెన్షన్ పడతారు. మీకు ఎవరి మీద అయిన డౌట్ ఉందా అని ముకుల్ అడుగుతాడు. MSR అని ఒకతను మా కాలేజీని సొంతం చేసుకోవాలని ట్రై చేసాడు కానీ ఇలా మనిషిని చంపే రకం కాదు అని రిషి అంటాడు. అందరు అలాగే కన్పిస్తారు సర్ అని వసుధార అంటుంది. మీరు ఆ సిచువేషన్ ఉన్నారు కదా మరి మీరు ఎందుకు వెళ్లారు. మీకు ఎవరు చెప్పారని వసుధారని ముకుల్ అడుగుతాడు. ధరణి పేరు వసుధార చెప్పకుండా.. రిషి సర్ కాలేజీ నుండి టెన్షన్ గా వెళ్తుంటే మా స్టూడెంట్స్ తో కలిసి వెళ్ళానని వసుధార చెప్తుంది. అవును పాండియన్ కి నేనే లొకేషన్ షేర్ చేశానని రిషి అంటాడు. మరి టెన్షన్ గా వెళ్లారనే మీరు సర్ వెనకాల వెళ్ళారా అని వసుధారని ముకుల్ అడుగుతాడు. అవును సర్ ఇది వరకు సర్ పై ఎటాక్ జరిగింది. అందుకే నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అందుకే వెళ్ళనని వసుధార చెప్తుంది. సరే త్వరలోనే దీనికి కారణం అయిన వాళ్ళెవరో తెలుసుకుంటానని ముకుల్ చెప్పి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత రిషి దగ్గరికి వసుధార మల్లెపూలు తీసుకొని వస్తుంది. రిషి వసుధారలు సరదాగా మల్లెపూలు అల్లుతు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు తమ ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్ తో బెల్ట్ తో తనకు తనే కొట్టుకుంటుంటే దేవయాని వచ్చి.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. ఆ తర్వాత శైలేంద్రకి ధరణి కాఫీ తీసుకొని వచ్చి.. వాళ్ళతో వెటకారంగా మాట్లాడేసరికి శైలేంద్రకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.