English | Telugu

 కరివేపాకు వెళ్లి పక్కన నుంచో... మీ అమ్మతో తిట్టిస్తావా...

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ ఏమో కానీ భాస్కర్ వాళ్ళ అమ్మ మాత్రం ఇమ్మానుయేల్ ని పట్టుకుని అందరి ముందు దుమ్ము దులిపేసింది. పటాస్ ప్రవీణ్ టీమ్ లో సత్తిపండు తన భార్యతో వచ్చి స్కిట్ చేసాడు. అది చూసిన రష్మీ వెంటనే మాట్లాడుతూ ఒక సీనియర్ కపుల్ మన మధ్య ఉన్నారు అని భాస్కర్ వాళ్ళ అమ్మని నాన్నని చూపించింది. మీ పెళ్ళై ఎన్నేళ్లయింది అని అడిగేసరికి 1976 లో అయ్యింది అని చెప్పారు వాళ్ళు . "మీ ఇంట్లో వంటలో ఉప్పు తక్కువైతే ఎం చేస్తారు" అని అడిగేసరికి "ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుంటాం" అని చెప్పారు భాస్కర్ వాళ్ళ నాన్న. "ఎప్పుడైనా నాన్నని కొట్టావా" అని భాస్కర్ వాళ్ళ అమ్మని ఇమ్మానుయేల్ ని అడిగాడు " నేను ఎప్పుడూ కొట్టలేదు. రెండు రోజులు మాట్లాడను కానీ...కొట్టడం ఉండదు...మా ఆయన అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకు అంతే ఇష్టం..మా ఆయనకు 18 ఏళ్ళు నాకు 13 ఏళ్ళు..అప్పుడు పెళ్లి చేశారు..అప్పుడు అన్ని రకాల ఆటలు ఆడేదాన్ని.

ఆ టైములో మా నాన్న వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి చేసుకో..లేదంటే నూతిలో దూకేస్తాను అంటే పెళ్లి చేసుకున్నా " అని చెప్పారు వాళ్ళ అమ్మ. "కోడళ్ళు ఎంతమంది" అని ఇమ్ము అడిగేసరికి "కోడళ్ళు ఎంతమందైనా కానీ పోషిస్తున్నాడా లేదా అని చూసుకుంటాను. నీ కెపాసిటీ నీది నువ్వు అందమైనదాన్ని చేసుకో..ఐనా నీ ఫేస్ కి ఒక్కతి కూడా దొరకడం లేదు ఇంకా ముగ్గురు దొరుకుతారా..నా కొడుకు భాస్కర్ అందగాడు..ఎవరైనా సరే మా అబ్బాయి మీద పైట విసిరారు కానీ మా అబ్బాయి ఎవరి మీద షర్ట్ విసరలేదు...నువ్వు విసిరినా ఎవరూ పడడం లేదు...తిట్టాను అన్నావ్ కాబట్టి తిట్టాను. నువ్వు తేల్చుకుందాం అంటే వంద మందిని తెచ్చుకో నేను ఒక్కదాన్నే వస్తాను మా ఆయన కూడా రాడు.." అని భాస్కర్ వాళ్ళ అమ్మ అనేసరికి " నీ టీమ్ లోంచి వెళ్లిపోయానని ఎన్నెన్ని మాటలు అనిపిస్తున్నావ్ నన్ను మీ అమ్మతో...ఏందయ్యా ఇది నాకు " అని ఇమ్ము భాస్కర్ ని చూస్తూ ఫీలైపోయేసరికి "కరివేపాకు వెళ్లి పక్కన నుంచో" అని రష్మీ కూడా కౌంటర్ వేసేసింది..."ఆ మాట నేను అందామని అనుకున్న కానీ నువ్వు ఫీలవుతావని అనలేదు" అంటూ ఇమ్ముని ఒక ఆట ఆడేసుకున్నారు బులెట్ భాస్కర్ వాళ్ళ అమ్మ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.