English | Telugu
మూలిక కలిపిన పాలు తాగిన రాజ్ ఏం చేయనున్నాడు!
Updated : Jul 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -136 లో... రాజ్ ఇంటికి రాగానే ఆఫీస్ లో రాహుల్ ని అందరి ముందు ఎందుకు అవమానించవని రుద్రాణి అడుగుతుంది. అలా రాజ్ ని రుద్రాణి అడిగేసరికి కావ్యకి కోపమొచ్చి.. నా భర్త ఏం తప్పు చేశాడని అందరి ముందు నిలదీస్తున్నావని అడుగుతుంది. మరి నా భర్త ఏం తప్పు చేశాడని అలా అవమానించారని అని స్వప్న అంటుంది. మీరు ఆపండని రాజ్ అంటాడు.
ఆ తర్వాత అందరూ నా కొడుకుని అనేవాళ్లే మరి కళ్యాణ్ ఏం చేస్తున్నాడు. ఇంట్లో ఖాళీగానే కదా ఉండేదని రుద్రాణి అంటుంది. నా కొడుకుకి, నీ కొడుకుకి పోలిక ఏంటి ఇంకోసారి నా కొడుకు గురించి మాట్లాడకని ప్రకాష్ అంటాడు. రాహుల్ తప్పు చేసాడు. అదే చెప్పాను.. అందులో అందరి ముందు అవమానించడం ఏముంది.. అలా చెప్తేనే రాహుల్ ఇంకొకసారి ఆ తప్పు చెయ్యకుండా ఉంటాడని అలా అన్నట్టుగా రాజ్ అంటాడు. అసమర్ధులకు నా కంపెనీలో స్థానం లేదు. కళ్యాణ్ ని మీరు ఇంకొక సారి ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోనని రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంటి రాహుల్ కి బిజినెస్ గురించి ఏం తెలియదా? నాతో అబద్దం చెప్పాడా? ముందైతే నా కడుపుని నిజం చేసుకొవాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత అపర్ణ రాజ్ దగ్గరికి వెళ్లి.. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు. అయినా నీ పెళ్లి విషయంలో ఇంత మోసం చేసిన రాహుల్ ని నువ్వు ఎలా ఆఫీస్ కి రానిస్తున్నావ్.. ఇప్పుడు నీ స్థానం కూడా తీసుకోడని గ్యారంటీ ఏంటని రాజ్ తో అపర్ణ అంటుంది. నేను, కళ్యాణ్, రాహుల్ ముగ్గురం కలిసి పెరిగాం. తప్పు చేశాడని దూరం పెట్టలేను కదా అని రాజ్ అంటాడు. వాళ్ళ మాట్లాడుకునేది కావ్య విని రాజ్ నిజంగా గొప్పవాడు.. తనని మోసం చేసిన రాహుల్ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడని అనుకుంటుంది.
మరొక వైపు రాహుల్ నేను చెప్పినట్టు వినాలని అనుకొని రాహుల్ తాగే పాలల్లో ఒక మూలిక కలుపుతుంది స్వప్న. మూలిక కలిపినా పాలు ఒక దగ్గర పెట్టి ఫోన్ మాట్లాడుతూ స్వప్న పక్కకి వెళ్తుంది. అప్పుడే రాజ్ కోసం కావ్య పాలు కలిపి స్వప్న పెట్టిన గ్లాస్ పక్కనే పెడుతుంది. స్వప్న వచ్చి కావ్య పెట్టిన పాల గ్లాస్ ని తీసుకొని వెళ్తుంది. స్వప్న మూలిక కలిపిన పాలు కావ్య పనిమనిషికి ఇచ్చి రాజ్ కి ఇవ్వమంటుంది. మూలిక కలిపిన పాలు అనుకొని రాహుల్ కి పాల గ్లాస్ ఇస్తుంది. రాహుల్ పాలు తాగి పడుకుంటాడు. ఇదేంటి ఇలా పడుకున్నాడని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు మూలిక కలిపిన పాలు తాగి రాజ్ మత్తుగా కావ్య దగ్గరికి వస్తాడు. కావ్య దగ్గరగా రాజ్ వస్తుంటే తను బయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.