English | Telugu
ఆమె చేసిన బిర్యానీ కోసం ఇంట్లోని వాళ్లంతా వచ్చారుగా!
Updated : Nov 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -304 లో.. మురారి ఏదో ఆలోచిస్తూ తల పట్టుకొని ఇబ్బంది పడుతుంటే అప్పుడే ముకుంద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎవరో ఒక అమ్మాయి గుర్తుకు వస్తుంది వాంతి వస్తుందని మురారి అంటాడు. అప్పుడే రేవతి భవాని, మధు ఇద్దరు మురారి దగ్గరికి వస్తారు.
ఆ తర్వాత మురారి వాంతింగ్ చేసుకుంటుంటే ముకుంద చెయ్యి పడుతుంది. మురారి తన చేతిలో వాంతిగ్ చెయ్యడంతో ముకుంద పట్ల భవానికి సింపతి పెరుగుతుందని ముకుంద అనుకుంటుంది. నువ్వు వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకొని రా ముకుంద అని భవాని అనగానే ముకుంద వెళ్తుంది. సారి చేంజ్ చేసుకుంటే సింపతీ పోతుందని ఆలోచిస్తుంది. నువ్వు ఒంటరిగా అసలు ఉండకు మురారి నిన్ను నేను అసలు ఒంటరిగా ఉంచనని ముకుంద అంటుంది. నువ్వు మురారిని చూసుకో ముకుంద అని భవాని చెప్పగానే.. కృష్ణ గురించి రేవతి అలోచిస్తుంటుంది. మరొక వైపు కృష్ణ భవాని అన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి మధు వస్తాడు. ఏంటి ఏసీపీ సర్ నీకు దక్కడని, నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చావా అని కృష్ణ అనగానే.. అవునని మధు అంటాడు. ఏంటి ఏసీపీ సర్ ని వదిలి పెట్టి వెళ్ళాల అని కృష్ణ కోపంగా అనగానే.. మధు లోపల జరిగిన విషయాన్ని కృష్ణకి చెప్తాడు. ఇక ముకుంద మురారి పక్కనే ఉండి చూసుకోమని భవాని పెద్దమ్మ చెప్పింది. ఇక వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళు ప్రేమలో పడి దగ్గర అవుతారని మధు చెప్తాడు. అదేం లేదు ఏసీపీ సర్ అలా ఏం చేయడని కృష్ణ స్ట్రాంగ్ గా చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వస్తుంది. నువ్వు వెంటనే నీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళు. మురారిని ఇక నేను దగ్గర వుండి చూసుకుంటానని ముకుంద అంటుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. మరొక వైపు మురారికి మంచి వైద్యం కోసం అమెరికా పంపిస్తున్నానని రేవతితో భవాని చెప్తుంది.. మురారితో పాటు ముకుంద కూడా వెళ్తుంది. ఆ తర్వాత మురారి వచ్చి బిర్యానీ స్మెల్ వస్తుందంటూ కిందకి వస్తాడు. చేసేది ఇక్కడ కాదు వేణి మేడమ్ అని మధు అంటాడు. పదండి అందరం వెళదామని మురారి అనగానే.. మురారి చెప్పాడు కాబట్టి భవానికి ఇష్టం లేకున్నా కృష్ణ బిర్యానీ చేసే దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత కృష్ణ అందరికి బిర్యానీ రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.