English | Telugu

శ్రీముఖి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా...నా లక్కీ హీరోయిన్!


ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ టీమ్ ఇక్కడికి వచ్చింది. వీళ్లకు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చింది శ్రీముఖి అండ్ టీమ్. ఇక ఈ టైములో రిషి అంటే గర్ల్స్ కి వసు అంటే బాయ్స్ పిచ్చ ఫాన్స్ అని స్రేముఖి చెప్పింది. అలాగే రిషి దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంది శ్రీముఖి. "గుప్పెడంత మనసు ఐపోయింది అని కాకుండా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాటివ్వు" అని అడిగింది. "బ్రహ్మముడి ఆర్టిస్టుల కన్నా నేనే ఎక్కువగా డేట్స్ ఇస్తా" అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసాడు రిషి. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా రిషి సీరియల్ మదర్ జగతి వచ్చింది.

ఇక రిషి వసునూ ఎత్తుకుని తిప్పేసరికి ఎంత బాగుంటుందో ఈ జోడి అని శ్రీముఖి కామెంట్ చేసింది. తర్వాత శ్రీముఖి రిషికి దూరం నుంచి కిస్ ఇచ్చేసింది. ఈలోపు అవినాష్ "చాలు ఇక రా" అని రిషి మీద కోప్పడేసరికి "లాస్ట్ మిగిలింది కొంచమే ఐపోతుంది" అన్నాడు రిషి. "కొంచెం కూడా బాధ లేదా సీరియల్ ఐపోయినందుకు" అన్నాడు అవినాష్. "పర్లేదు ఇక్కడ కాపురం చేసుకుందాం లే" అని రిషి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత మహేంద్ర వచ్చి జగతిని ఎత్తుకుని గిరగిరా తిప్పేసాడు. ఇక రక్షని పొట్టి పిల్ల అన్నాడు రిషి. వసు హైట్ తనకు సెట్ కాదని శ్రీముఖి హైట్ తనకు సెట్ అవుతుందంటూ పొగిడేసాడు రిషి. దాంతో వసుకి కోపం వచ్చింది. బుజ్జగించేసరికి రిషి ఇంకా అనరాని మాటలు అనేశాడు. "శ్రీముఖి నా దిల్..నువ్వు భార్యవైనా నాకు భారంగా ఉన్నావ్ పక్కకు పో" అన్నాడు. తర్వాత గుప్పెడంత మనసు లోగో టి షర్ట్స్ వేసుకుని వాళ్లకు నచ్చిన కామెంట్స్ ని రాసుకున్నారు. ఇక వసు ఐతే ఏడ్చేసింది. అలాగే వసు తనకు లక్కీయేస్ట్ హీరోయిన్ అన్నాడు. తనకు ఒక గౌరవం తెచ్చింది, చనిపోయేముందు స్టార్ మా స్టేజి మీదకు వాళ్ళ నాన్న రావడం ఆయన ముందు అవార్డు అందుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నాడు రిషి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.