English | Telugu
రవితేజ వాళ్ళ అమ్మకు ముకేశ్ గౌడ అంటే చాలా ఇష్టం...
Updated : Aug 27, 2024
గుప్పెడంత మనసు సీరియల్ కి ఆమె బిగ్ ఫ్యాన్ కూడా నెక్స్ట్ ఇయర్ ముకేశ్ రెండు సినిమాలు రిలీజ్ గుప్పెడంత మనసు సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లి చివరికి ఎండ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఇందులో హీరో ముకేశ్ గౌడా నటన కానీ అతని ఆటిట్యూడ్ కానీ చాలా కూల్ ఉంటుంది అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు.. దాంతో లేడీ ఫాన్స్ అంతా ఆయన నటనకు ఫిదా ఇపోయారు. ఇక ముకేశ్ గౌడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. తెలుగు ఆడియన్స్ కి ఒక వ్యక్తి నచ్చితే గనక వాళ్ళ ఇంట్లో అబ్బాయికంటే ఎక్కువగా ఆదరిస్తారు అన్నాడు. అలా తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఇక ముకేశ్ గౌడ నటించిన గీత శంకరం, ప్రియమైన నాన్నకు మూవీస్ రెండు కూడా 2025 లో రిలీజ్ అవుతాయని చెప్పాడు.
ఇక టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ వాళ్లకు "గుప్పెడంత మనసు" సీరియల్ అంటే చాలా ఇష్టమని రవితేజ వాళ్ళ అసిస్టెంట్ ఒక సారి కాల్ చేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించారని చెప్పాడు ముఖేష్ గౌడా. అలాగే ముకేశ్ గౌడ అంటే బ్రహ్మానందంకి కూడా ఎంతో ఇష్టం. గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా ఆయన ఎంతో బిగ్ ఫ్యాన్ కూడా. ఆయన ఈ సీరియల్ షూటింగ్ సెట్ కి వచ్చి ముకేశ్ తో కలిసి ఫొటోస్ కూడా దిగారు. ఐతే బిగ్ బాస్ వెళ్లే ఛాన్స్ లేదని చెప్పేసాడు. ఐతే మా టీవీ కొలాబరేషన్ లో పని చేసే అవకాశం రావొచ్చు అని చెప్పాడు. వెబ్ సిరీస్ లో కానీ ఇంకా ఎందులో ఐనా కానీ కనిపించే అవకాశం ఉందని కూడా చెప్పాడు. అలాగే ఆడియన్స్ కి కూడా ఒక మాట చెప్పాడు. తనను ఇప్పటి వరకు సొంత కొడుకులా చూసుకున్నారు...రాబోయే రోజుల్లో కూడా తనకు ఇలాగే ప్రేమ, సపోర్ట్ కావాలని కోరుకున్నాడు.