English | Telugu
జబర్దస్త్ తన్మయ్ తండ్రి కన్నుమూత...కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
Updated : Aug 27, 2024
జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో అందరినీ కడపుబ్బా నవ్వించే తన్మయ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆమె ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణించడంతో ఆమె అల్లాడిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. తన తండ్రి చనిపోయిన విషయాన్ని తన్మయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తన తండ్రి పాడేను ఆమె మోసింది..అలాగే అంత్యక్రియలు నిర్వహించింది.
‘ మా నాన్నే నా హీరో.. నాన్న ఓ ఎమోషన్.. మిస్ యూ నాన్నా.. నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావ్.. కొడుకునైనా, కూతురినైనా నేను మీ బిడ్డనే’ అంటూ తన్మయి షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ విషయంలో బాధపడుతున్న తన్మయ్ కి ధైర్యం చెప్తున్నారు. రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్స్ పెట్టారు. తన్మయ్ అబ్బాయిగా పుట్టినా అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో తను వేసే లేడీ గెటప్పులు ఆడియెన్స్ ను బాగా అలరించాయి. దీంతో పాటు అప్పుడప్పుడూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగా కూడా ఉంది. అలాంటి తన్మయ్ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.