English | Telugu

సీతాకాంత్ కాళ్ళు‌ కడిగి నెత్తిన చల్లుకున్న మాణిక్యం.. శ్రీలతకి మైండ్ బ్లాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -54 లో.. సీతాకాంత్ ని తీసుకురావడనికి మాణిక్యం వాళ్ళింటికి వెళ్ళగా.. అక్కడ సీతాకాంత్ కన్పించకపోయేసరికి మాణిక్యం టెన్షన్ పడతాడు.‌ సీతాకాంత్, రామలక్ష్మి పెళ్ళి చేసుకొని రావడంతో మాణిక్యం నమ్మలేకపోతాడు. నేను నమ్మనని మాణిక్యం అనగానే.. మ్యారేజ్ సర్టిఫికేట్, ఫోటోలు చూపిస్తాడు.

మా పెళ్ళి జరిగింది కదా.. ఇక ధన, సిరిల పెళ్ళి జరిపించు అని సీతాకాంత్ అంటాడు. జరగదు.. ఎందుకంటే ఇలాంటి సర్టిఫికేట్లు, ఫోటోలని నేను అమీర్ పేట్ లో లక్ష తీసుకొస్తాను.. మీ పెళ్ళి జరిగిందంటే నేను నమ్మను నాకు సాక్ష్యాలు కావాలని మాణిక్యం అంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయిన మేమ్ పెళ్ళి చేసుకున్నామనేది నిజమని సీతాకాంత్ అంటాడు. అయితే పెళ్ళి తర్వాత జరిగే తంతు మా ఇంట్లో మీ ఇద్దరికి జరిపిస్తాను. ఆ తంతులో మీరు నిజంగా పెళ్ళి చేసుకున్నారో లేదో‌ నాకు తెలుస్తుందని మాణిక్యం అనగా.. సరేనని సీతాకాంత్ అంటాడు. మరోవైపు రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత టెన్షన్ పడుతుంది. దేవుడా నా కూతురికంటే వయసులో‌ చాలా వ్యత్యాసం ఉన్న ఆ సీతాకాంత్ తో నా కూతురు రామలక్ష్మి పెళ్ళి జరగకుండా చూడని వేడుకుంటుంది. ‌అప్పుడే ఇంటిముందు కార్ వచ్చి ఆగుతుంది మాణిక్యంతో పాటు సీతాకాంత్, రామలక్ష్మి కారులో నుండి దిగుతారు.

ఇక రామలక్ష్మి, సీతాకాంత్ గుమ్మం దగ్గరికి రాగానే.. మాణిక్యం తన భార్య సుజాతతో హారతి కర్పూరం తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకని సుజాత అనగా.. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారని మాణిక్యం అంటాడు. దాంతో సుజాత షాక్ అవుతుంది. నా కూతురు గొంతు‌ కోసారు కదా అని మాణిక్యంతో సుజాత అంటుంది. నా కూతురు బంగారమే.. అందుకే సీతాకాంత్ లాంటి వాడిని పెళ్ళి చేసుకుందని మాణిక్యం అంటాడు. ఇక సుజాత‌ గుమ్మం దగ్గరికి వెళ్ళి సీతాకాంత్ ను తిడుతుంటే .. ఇంకోసారి నా భర్తని ఏం అయినా అంటే నేను ఊరుకోనని రామలక్ష్మి అనగానే సుజాత షాక్ అవుతుంది. ఆ తర్వాత మాణిక్యం తగులుకొని‌ సుజాతని హారతి కర్పూరం తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక ఇంట్లో‌ ఇద్దరు అడుగెడుతుండగా.. సీతాకాంత్ వెనక్కి వెళ్తుంటాడు. వెంటనే తన వెనకాలే మాణిక్యం వెళ్ళి ఏం అయిందని అడుగుతాడు. నేను అలిగాను.. నేను నీ అల్లుడిని.. నువ్వు నా కాళ్ళు కడిగి నీ నెత్తిమీద పోసుకోవాలని సీతాకాంత్ అంటాడు. సరే సరే అని సీతాకాంత్ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాడు‌ మాణిక్యం. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలతకి కాల్ చేస్తాడు మాణిక్యం. ఇక నీ ప్లాన్ చెల్లదని, నువ్వు అనుకున్నది సాధ్యం కాదని, ఈ రోజే సీతాకాంత్, రామలక్ష్మిలకి‌ శోభనం ముహుర్తం పెట్టించానని, ఇక ఆ ఇంటికి వారాసుడు సీతాకాంత్ కొడుకే అని శ్రీలతతో మాణిక్యం అనగానే.. కోపంతో టేబుల్ మీద వస్తువలన్నీ పడేస్తుంటుంది శ్రీలత. వెంటనే సందీప్ వచ్చి తనని ఆపి అన్నయ్య పెళ్ళి చేసుకున్నాడు అంతే కదా.. ఇప్పుడేమైంది అంత కంగారెందుకని సందీప్ అడుగుతాడు. మీ గురించేరా నా టెన్షన్ అని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.