English | Telugu

నన్ను ఇలా పిలిచింది అవమానించడానికా?

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రోజాకు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు బుల్లితెర పై కూడా అంతే క్రేజ్ ఉంది రోజాకి. జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు రోజాకు మంత్రి పదవి వచ్చేసరికి జబర్దస్త్ షో చేయడం మానేసి మంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అయితే రోజా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ చీఫ్ గెస్ట్ గా స్పెషల్ ఈవెంట్‌కు వచ్చింది. దసరా కోసం మల్లెమాల వాళ్ళు ప్లాన్ చేసిన "దసరా వైభవం" అనే ఈవెంట్ లో రోజా మెరిసింది. "ది లేడీ బాస్ ఈజ్ బ్యాక్" అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశారు టీమ్ మెంబ‌ర్స్‌.

ప్రోమోలో చూపించిన దాని ప్ర‌కారం రోజా స్టేజి మీదే కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇది ప్రోమో స్టంట్ అని అర్థ‌మైపోతుంది. ప్రోమో చివర్లో రోజా ఎమోషనల్ అయ్యింది. "నన్ను ఇలా పిలిచింది అవమానించడానికా?" అంటూ తనకు మెడలో వేసిన పూల దండను విసిరిపారేసి,నూకరాజు వైపు సీరియస్ గా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

"వాడు కూడా అదే అంటున్నాడు?" అని ఏదో చెప్పి కవర్ చేయడానికి ట్రై చేసాడు ఆది. "మీరంతా ఇలా ప్లాన్ చేసుకునే రమ్మాన్నారా?" అంటూ రోజా అలా వెళ్లిపోయేసరికి స్టేజ్ మీద ఉన్న అంతా షాకయ్యారు. ఇక రోజా ఎందుకు అంతలా హర్ట్ అయ్యింది? నూకరాజు ఏమన్నాడు?.. తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..