English | Telugu
నాన్నను తలచుకొని కన్నీరుమున్నీరైన పటాస్ ప్రవీణ్!
Updated : Sep 27, 2022
పటాస్ ప్రవీణ్ అంటే బుల్లితెర మీద ప్రతీ ఒక్కరికీ పరిచయమే. 'పటాస్' తర్వాత 'జబర్దస్త్' స్టేజ్ మీద మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే షోలో ప్రవీణ్, ఫైమా లవ్ స్టోరీ కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఐతేఫైమా ఇప్పుడుబిగ్ బాస్ ఇంట్లో ఉంది. ప్రవీణ్ మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తున్నాడు.
ప్రవీణ్ కన్న తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రే తనను ఇంత ప్రయోజకుడిని చేసాడని ప్రవీణ్ ప్రతీ స్టేజి మీద చెప్పేవాడు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన 'ఎక్స్ ట్రా జబర్దస్త్' ప్రోమోలోప్రవీణ్ "నా తండ్రిని కోల్పోయాను" అంటూ స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్నాడు. "దేవుడు మా అమ్మను తీసుకుపోయాక ఇచ్చింది నాన్న ఒక్కడినే.. అన్నీ తానై పెంచి పోషించాడు.. ఏ బాధ వచ్చినా నాన్నకే చెప్పుకునే వాడిని. ఈరోజు ఆయన కూడా లేకుండా పోయాడు" అని ప్రవీణ్ ఎంతో బాధపడ్డాడు.
"ప్రతీ రోజూ రాత్రి.. 'నాన్నా తిన్నావారా?' అని నన్ను అడిగితే గానీ నిద్రపోయే వాడు కాదు" అంటూ తండ్రిని తల్చుకుంటూ ప్రవీణ్ కన్నీరు మున్నీరయ్యాడు. ఇక జడ్జి ఇంద్రజ వచ్చి ప్రవీణ్ ని ఓదార్చింది. "నీకు మేమంతా ఉన్నాం" అని హత్తుకుని భరోసా ఇచ్చింది. ఇంద్రజను ప్రవీణ్ "అమ్మా" అంటూ పిలుస్తాడు. ఎందుకంటే ఆమె కూడా ప్రవీణ్ ని కొడుకులా చూసుకుంటుంది.