English | Telugu
ఈ కటౌట్ చూడగానే నేను రనౌట్.. వర్షిణి హాట్ కామెంట్స్
Updated : Aug 28, 2022
స్టార్ మా అంటే చాలు అలుపులేని షోస్ కి అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ స్టార్ మాలో వినాయక చవితి స్పెషల్ సందడి మొదలైపోయింది. "మాతో పండగే పండగ" అంటూ ప్రతీ గడపలో నవ్వుల పూలు పూయించేందుకు స్పెషల్ షో వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా ఈ షోలో బుల్లి తెర నటుల ఆటాపాటా మాములుగా లేదు. ఈ షోకి హోస్ట్ గా రవి, వర్షిణి వచ్చేశారు. ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా "రంగరంగ వైభవంగా" మూవీ టీం వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ విచ్చేసి ఫుల్ ఎంటర్టైన్ చేసేసారు. "ఈ కటౌట్ చూడగానే నేను రనౌట్ ఐపోయాను" అంటూ వైష్ణవ్ తేజ్ కి వర్షిణి సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చేసింది.
ఇక భీమ్లా నాయక్ సాంగ్ కి వైష్ణవ్ , కేతిక డాన్స్ చేశారు. "నేను నిన్నే చూస్తాను..నీ గురించే కలలు కంటాను" అంటూ అవినాష్ కేతికతో ఫ్లర్ట్ చేస్తుంటాడు. "నీకు పెళ్లయిపోయింది" అంటూ ఎక్స్ప్రెస్ హరి అనేసరికి " నీకు పెళ్లయిందా అంటూ కేతికా అడుగుతుంది..కాదు వాళ్లంతా అబద్దాలు చెప్తున్నారు" అంటూ జోక్ చేస్తాడు.
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఈవెంట్ లో అందరూ కలిసి కేక్ కోసి పవన్ కి విషెస్ చెప్తారు. ఇక మధ్యలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి షోకి మంచి జోష్ ని తెచ్చింది. ఇక తర్వాత వంటలక్క ఎంట్రీ అద్దిరిపోయింది. ఫైనల్ గా అమరదీప్, తేజుకి బుల్లితెర నటులంతా కలిసి ఉంగరాలు మార్పించి, దండాలు మార్పిస్తారు. తేజు వాళ్ళ నాన్న విగ్రహాన్ని తయారు చేసి ఈ ఈవెంట్ స్టేజి మీద పెట్టి తేజు వాళ్ళ అమ్మని పిలుస్తారు. ఆ సన్నివేశం అందరినీ కంటతడి పెట్టించింది.