English | Telugu
ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో మెరీనా-రోహిత్ దంపతులు!
Updated : Feb 1, 2024
ఇండియా పాకిస్తాన్ మధ్యలో నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. క్రికెట్ చరిత్రలో ఈ రెండు దేశాలకి మ్యాచ్ అంటే చాలు కొన్ని కోట్ల మంది జనాలు పనులు మానుకొని చూస్తారు. అదే ఇండియాలో జనవరి 26 , ఆగస్ట్ 14 అంటే చాలు ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి వెళ్ళడానికి ఎంతో మంది సిద్దమవుతారు. కానీ ఇక్కడికి ఆ రోజుల్లో వెళ్ళడానికి కొంతమందికే సాధ్యమవుతుంది. అలాంటి అవకాశం లభించిన వారిలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్ దంపతులు ఇద్దరున్నారు.
మెరీనా, రోహిత్ సాహ్ని.. బుల్లితెర సీరియల్స్ చూసే ప్రేక్షకులకు సుపరిచితమే. మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించగా.. రోహిత్ ని పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటుంది. అప్పట్లో జీ తెలుగులో ప్రసరమయైన 'అమెరికా అమ్మాయి' సీరియల్ లో కళ్యాణిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. రోహిత్ కూడా సీరియల్స్ లో నటించాడు. నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. రోహిత్-మెరీనా ఇద్దరు కలిసి 'డ్యాన్స్ జోడి డ్యాన్స్' లో కూడా నటించారు.
అలా బుల్లితెరపై ఫేమస్ అయిన వీరిద్దరికి బిగ్ బాస్ లో 'రియల్ కపుల్' కోటాలో అవకాశం లభించింది. మెరీనా రోహిత్ బిగ్ బాస్ లో జంటగా అడుగుపెట్టి.. ఇద్దరు మంచి ప్రవర్తనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే రోహిత్ ని ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. రోహిత్ లోని డీసెంట్ నెస్, కూల్ అండ్ కామ్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ నుండి వచ్చాక బిబి జోడీలో కూడా డ్యాన్స్ చేశారు. అయితే వీరిద్దరు తమ డాన్స్ తో అందరిని అంతగా మెప్పించలేకపోయారు. దాంతో బిబి జోడి నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ భార్యపై చూపించే ప్రేమ కేరింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. దాంతో అతడికి ఫ్యాన్ బేస్ పెరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకవైపు వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండగా.. మరోవైపు ఇన్ స్ట్రాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. వీరిద్దరి జోడికి క్యూట్ కపుల్స్ అనే పేరు కూడా ఉంది. తాజాగా ఇండియా బార్డర్ కి వీళ్ళు ఇద్దరు వెళ్ళగా.. అక్కడ జనాలని చూసి షాక్ అయ్యారంట. అంతమంది ఉంటారని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదని మెరీనా అంది. అక్కడికి ఎలా వెళ్ళారు.. ఏం జరిగిందంటూ అన్నీ క్లియర్ గా వివరించింది మెరీనా. దీనికి దేశంలోని యువకులంతా .. గూస్ బంప్స్ సీన్ అంటు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.