English | Telugu
చిరంజీవితో జబర్దస్త్ ఇమ్మాన్యుయల్.. నెట్టింట వైరల్!
Updated : Feb 1, 2024
ఎవరైన చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.. ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని అంటూ సాగే ఈ పాటని చిరంజీవిని ఉద్దేశించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసారు. ఇప్పుడు చిరంజీవికి పద్మ విభూషన్ రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగిందనే చెప్పాలి. తెలుగు సినిమా అనగానే మొదట సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అని అందరికి తెలిసిపోతుంది.
చిరంజీవిని దగ్గరనుండి చూడటమే గొప్ప. ఆయనకుండే ఫ్యాన్ క్రేజ్. వెండితెరపై ఆయన గ్రేస్ ఎవరికి రాదనే చెప్పాలి. అలాంటి చిరంజీవిని ఓ అభిమాని దగ్గరకొచ్చి ఫోటో ఇవ్వడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడమంటే ఇంక అతనికున్న లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ నెరవేరినట్టే. ఇప్పుడు అదే జరిగింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ఇమ్మాన్యుయల్ .. చిరంజీవి గారితో కలిసి ఓ ఫోటో దిగాడు. ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. అదే విషయాన్ని తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో షేర్ చేసి చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యుయల్. " చిన్నప్పుడు నువ్వు ఏమవుతావురా అని ఎవరైన అడిగినప్పుడు.. చిరంజీవిని అవుతా అని అనేవాడిని. అలాంటిది ఈ రోజు ఆయనని కలవడమనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఒక మనిషిని చూస్తే నా పెదాలు తడి ఆరిపోవడం, కళ్ళు చెమ్మగిల్లడం ఇదే మొదటిసారి. ఈ జన్మకి ఇది చాలు " అంటు ఇమ్మాన్యుయల్ ఈ పోస్ట్ కి రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్.. డ్రీమ్ కమ్స్ ట్రూ అని కామెంట్లు చేస్తున్నారు.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ షో ద్వారా తన కామెడీతో తెలుగు టీవి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో మొదట వర్షతో కలిసి లవ్ ట్రాక్ నడిపిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అదంతా జబర్దస్త్ షో కోసమే అన్నట్టుగా చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన ప్రతీ స్కిట్ దాదాపు హిట్ అయిందనే చెప్పాలి. తాజాగాఇమ్మాన్యుయేల్ రీసెంట్ గా ' నేను జబర్దస్త్ కి రావడానికి కారణం వీళ్ళే' అంటూ మరో వ్లాగ్ ని అప్లోడ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. కొంతకాలం క్రితం 'ప్రేమ వాలంటీర్' అనే వెబ్ సీరీస్ లో చేసిన ఇమ్మాన్యుయల్ లో ఓ నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మొదటిసారి యావర్ ని కలిసాను అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ లభించింది. కాగా ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవితో ఇమ్మాన్యుయల్ కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.