English | Telugu
బావుంది భోజనం..రాత్రి ఉంది శోభనం...రెచ్చిపోయిన రష్మీ
Updated : Dec 14, 2023
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కంటే ఇప్పుడు మిగతా ఇండివిడ్యువల్ షోస్ లో కామెడీ బీభత్సంగా ఇరగదీస్తోంది. ఈ రెండు షోస్ లో మాత్రం మనకు మనం కితకితలు పెట్టుకుని నవ్వుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో రెగ్యులర్ కమెడియన్స్ తో పాటు సినిమా రివ్యూస్ తన స్టయిల్లో అరుస్తూ ప్రాసలతో పంచులతో డైలాగ్స్ ని పరిగెత్తించే మీమార్ , రివ్యూవర్ బ్రో లక్ష్మణ్ కూడా మెరిశాడు.
ఇక ఇప్పుడు లక్కీ లక్ష్మణ్ పేరుతో ఇతనిది ఒక కొత్త టీమ్ ని లైన్ లోకి తీసుకొచ్చారు మేకర్స్. "జడ్జీలు మాకు ఇస్తారు మార్కులు టెన్.. అప్పుడే వేసింది బ్రో రష్మీ నా మీద కన్ను" అంటూ స్టేజ్ ఎక్కకముందే బిస్కెట్ పంచులు వేసేశాడు లక్ష్మణ్. ఇక బ్రో పక్కనే ఉన్న పూలచొక్కా నవీన్ అనే మరో కమెడియన్ డప్పు కొడుతూ కనిపించాడు. ఇక వెంటనే "నువ్వు ఓకే అంటే వెళ్దాం గోవా..
మీ తమ్ముడికి నేనే బావా" అంటూ బ్రో కౌంటర్ వేయగానే దానికి కంటిన్యుయస్ ప్రాసగా "ఇక స్టేజ్ మీదకి రావా" అంటూ పంచ్ ఇచ్చారు జడ్జ్ కృష్ణ భగవాన్. ఇక స్కిట్‌లో బ్రో తన సహా కమెడియన్ తో స్కిట్ చేస్తున్నాడు. ఇంతలో బ్రో వైఫ్ గా చేసిన లేడీ కమెడియన్ "భోజనం పెట్టి ఎలా ఉందొ నీ స్టైల్లో చెప్పు" అని లక్ష్మణ్ అడిగేసరికి నేను చెబుతా అంటూ రష్మీ మధ్యలో వచ్చి ఫుల్ జోష్ తో "బావుంది భోజనం.. రాత్రి ఉంది శోభనం" అంటూ చెప్పగానే సెట్ మొత్తం పగలబడి నవ్వింది. ఇక లక్ష్మణ్ బ్రోకి రష్మీ తన డైలాగ్ చెప్పేసరికి ఏం చేయాలో తెలియక తన ఫేస్ ని మాడిపోయిన అట్టులా పెట్టాడు. ఐతే ఈ షో రేటింగ్ ఏ వారానికి ఆ వారం తగ్గిపోతూ ఉండడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకొస్తున్నారు జబర్దస్త్ మేకర్స్.