English | Telugu

వీలు చూసుకుని మా ఇంటికి భోజనానికి రా రవి....


మహిళా దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ గా జీ తెలుగులో "శివంగివె" అనే షో ప్రసారం కాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. అలాగే అలనాటి ఆరడగుల అందగాడైన నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఇక హోస్ట్ రవిని ఆమె ప్రత్యేకంగా పలకరించిన తీరును రవి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు " ఈ అద్భుతమైన స్వీట్ లేడీని నేను షోలో కలిసాను.

ఆ క్షణంలో ఆమె నా కూతురు వియా గురించి అడిగారు... చాలా క్యూట్ గా ఉంటుంది ! ఎలా ఉంది బుజ్జిదీ? అని అడిగేసరికి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. బాగుందమ్మా...మీ ఆశీస్సులు కావాలి తనకి" అని చెప్పాను. "వీలు చూసుకుని మీ ఫామిలీతో మా ఇంటికి భోజనానికి రండి అని ఇన్వైట్ చేశారు. శ్యామల గారి మనసు ఎంత గొప్పదో అప్పుడు నాకు అర్ధమయ్యింది" అని చెప్పాడు రవి. ఈ షో 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. అలాగే ఈ షోకి బాహుబలి తాలిని కూడా తీసుకొచ్చి అందరికీ వడ్డించారు శ్యామల. ఇక రవి పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. "అన్నా అసలు మిస్ అవ్వదు ఆ ఛాన్స్ ని మాకు ఎలాగో ఉండదు సో మీరైనా వెళ్ళండి...పెద్దమ్మగారు మంచితనానికి మారుపేరు...ఇంత మంచి ఫ్యామిలీ కాబట్టే ప్రభాస్ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఆయన ఫామిలీ ఎప్పుడూ బాగుండాలి. నిజమైన రాజుల ప్రేమ అలానే ఉంటుంది. వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. ఆమె చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.