English | Telugu

నాకు వెన్నెల కిషోర్ బెస్ట్ ఫ్రెండ్ ఏంటి.. అతనికి చాలా పొగరు!

మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీ అక్టోబర్ 21న విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను బాగా జరుగుతున్నాయి. ఇదే టైములో వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంట‌ర్వ్యూలో "జిన్నాలో మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు.. ఇలా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు" అని యాంకర్ అంది.

"వెన్నెల కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. అతనికి చాలా పొగరు.. నాకు వెన్నెల కిషోర్ అంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను మాట్లానివ్వకుండా నా మీద కౌంటర్ లు వేసేది ఎవరైనా ఒకరు ఉన్నారు అంటే అది వెన్నెల కిషోర్ మాత్రమే. అందుకే అతనంటే నాకు ఇష్టం లేదు. చనువు ఇచ్చేది ఏమీ లేదు. అతనొక పెక్యులియర్ కేరెక్టర్.. చనువు తీసేసుకుంటాడు.. అందుకే వెన్నెల కిషోర్ అంటే నాకు నచ్చదు." అని విష్ణు చెప్పాడు.

"ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు మీరు కిషోర్ గురించిసరదాగా అంటున్నారేమో అనుకున్నా" అని యాంకర్ అంది. దానికి "నో.. నిజమే చెప్తున్నా.. వెన్నెల కిషోర్ నీకు పొగరు.. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు" అనే బిట్ మళ్ళీ చెప్పి, "ఇది కట్ చేసి అతనికి చూపించండి" అని కౌంటర్ వేసి అంతలోనే "ఇదంతా జోక్" అనేశాడు విష్ణు.