English | Telugu
భావోద్వేగానికి లోనవుతున్న హౌస్ మేట్స్!
Updated : Oct 13, 2022
బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బ్యాటరీ ఛార్జ్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ గత మూడు రోజుల నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉత్కంఠభరితంగా కొనసాగుతూ, ప్రతి హౌస్ మేట్ కంటతడి పెట్టేలే జరుగుతోంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో గీతు తన నాన్న గారితో ఆడియో కాల్ మాట్లాడగా, శ్రీసత్య తన వాళ్ళ ఫ్యామిలితో వీడియో కాల్ మాట్లాడింది.
శ్రీసత్య తన తల్లితండ్రులతో మాట్లాడుతుండగా ఎమోషనల్ అయింది. తను అలా ఏడ్వటం చూస్తూ హౌస్ మేట్స్ కూడా కంటతడి పెట్టుకొన్నారు. తరువాత ఇనయ వంతు రాగా, బ్యాటరీలో ఛార్జ్ తక్కువగా ఉండటంతో తన వాళ్ళతో ఆడియో కాల్ గాని, వీడియో కాల్ గాని మాట్లాడలేకపోయింది. తన అమ్మ నాన్న ఉన్న ఫోటో ఫ్రేమ్ ని ఎంపిక చేసుకొంది. కాసేపటికి ఆ ఫోటోఫ్రేమ్ లోపలికి వచ్చింది. తర్వాత హౌస్ మేట్స్ కి తన పేరెంట్స్ ని చూపించి ఏడ్చేసింది. తను ఏడ్వటం చూసి అందరు తనని ఓదార్చే ప్రయత్నం చేసారు. "చాలా రోజుల నుండి మా అమ్మ నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆడియో కాల్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఏం మాట్లాడేదో" అంటు బాధపడింది. ఆ తరువాత ఆదిత్యకి అవకాశం రాగా, తన భార్యతో ఆడియో కాల్ సెలెక్ట్ చేసుకున్నాడు. తన భార్యతో మాట్లాడుకుంటూ ఏడ్చేసాడు. ఆ తర్వాత తన అట తీరు గురించి అడిగి తెలుసుకున్నాడు. తన కూతురుతో మాట్లాడేసరికి కన్నీళ్ళు ఆగలేదు. హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ఈ విధంగా ఆదిత్య తన భార్యతో ఆడియో కాల్ సెలక్ట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ సున్నా శాతం అయింది. దానికి బాస్ ఏదైనా బ్యాటరీ ఛార్జ్ పెంచుకునే అవకాశాలు కల్పిస్తాడేమో చూడాలి. అయితే ఈ టాస్క్ మొదలైన రోజు నుండి అందరూ వాళ్ళ ఫ్యామిలీని గుర్తుచేసుకుంటూ హౌస్ లో ఎమోషనల్ అవుతున్నారు. కాగా ఈ టాస్క్ లో విజేతగా ఎవరు నిలుస్తారో? కెప్టెన్ గా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారో చూడాలి మరి.