English | Telugu
చీర గురించి నా ఫాంటసీ చెప్తే సెన్సార్ వాళ్ళు ఊరుకోరు!
Updated : Oct 6, 2022
'జిన్నా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు 'డాన్స్ ఇండియా డాన్స్' షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. లేడీ కమెడియన్ రౌడీ రోహిణి వచ్చి, "నాకు పెళ్లి కావాలి" అని అడిగింది. హోస్ట్ అకుల్ బాలాజీ, "నాకు సన్నీ లియోన్ కావాలి" అని అడిగాడు. "అయితే మీరు బాంబేకి వెళ్లాల్సిందే" అని ఆట పట్టించాడు మంచు విష్ణు. "హారర్ టైపు ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు ఏమన్నా చేశారా?" అనే ప్రశ్న హోస్ట్ నుంచి విష్ణుకు ఎదురైంది.
"ఇంజనీరింగ్ చదివే టైంలో హాస్టల్ లో ఉండేటప్పుడు అందరినీ భయపెట్టేవాళ్ళం. ఒక చెట్టు కింద ఒకడికి తెల్ల డ్రెస్ వేసి పడుకోబెట్టేవాళ్ళం.తర్వాత అందరం గ్రూప్ గా వచ్చేవాళ్ళం. ప్రతీ గ్రూప్ లో ఒక బకరా ఉంటాడు కదా వాడిని ఏడిపించడానికి ఇలా చేసేవాళ్ళం. మా నాన్నకు ఈ విషయాలు తెలియవు.. లేదంటేనా బెల్టు తీసి కొడతాడాయన" అని చెప్పాడు విష్ణు.
శరత్-ఆయుషి జంట వచ్చి "తెల్లా తెల్లని చీర" అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక హోస్ట్ "చీర మీద మీ ఒపీనియన్ ఏమిటి? అని అడిగితే, "చీర కంటే అందమైన వస్త్రధారణ మరొకటి లేదు" అని చెప్పాడు విష్ణు. "మరి మీకు ఇలాంటి ఫాంటసీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా?" అని హోస్ట్ అడిగాడు. "నా ఫాంటసీస్ చాలా క్రేజీ.. నేను చెప్తే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత మీకే ప్రాబ్లమ్" అంటూ సెన్సార్ లేని ఫాంటసీ చెప్పాడు విష్ణు. "వెన్నెలవే.. వెన్నెలవే అనే సాంగ్ కి నేను నా భార్య విన్నీతో కలిసి డాన్స్ చేస్తాను. అదే నా ఫాంటసీ " అని చెప్పాడు. తర్వాత ఈ పాటకు సంగీతతో కలిసి డాన్స్ చేసాడు మంచు విష్ణు.