English | Telugu

ముద్దు అడిగిన ఆది.. లాగిపెట్టి చెంపలు వాయించిన శ్రద్ధ‌!

'ఢీ' షో అంటే చాలు ముద్దుల కోసం, హగ్గులు కోసం ఆది రచ్చ చేస్తూనే ఉంటాడు. ఆది పంచ్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. కానీ ఆ డైలాగ్స్ కొన్ని సార్లు శృతి మించుతూ ఉంటాయి.మ‌రోసారి అలాగే శ్రుతి మించిన ఆదికి చెంప‌లు వాయించి షాకిచ్చింది శ్ర‌ద్ధా దాస్‌.

లేటెస్ట్ గా రిలీజ్ ఐన ఢీ షోలో ఆది, శ్రద్ధాదాస్ కలిసి నవ్వులు పూయించారు. ఇందులో శ్రద్దాదాస్ ని ముద్దు అడిగాడు ఆది.. దాన్ని హిందీలో ఏమంటారు? అని యాంక‌ర్‌ ప్రదీప్ ని అడిగాడు. "ముద్దు అంటే హిందీలో థప్పడ్" అని చెప్పాడు ప్ర‌దీప్‌. వెంటనేఆది ఆ మాటను శ్రద్దాకి చెప్పి "రెండు థప్పడ్ కావాలి" అని అడిగాడు.

"ఏం అడుగుతున్నావో తెలుసా?" అని అడిగింది శ్రద్ధ‌. అదేం వినకుండా ఆది కళ్ళు మూసుకుని ముద్దు కోసం వెయిట్ చేసేసరికి, శ్ర‌ద్ధ‌ వెనుకాముందు చూడకుండా దొరికిందే చాన్సు అనిఆది రెండు చెంపలను వాయించేసింది.

"ముద్దంటే థప్పడ్ అని చెప్పింది ఎవరు?" అని ప్రదీప్ మీద సీరియస్ అయ్యాడు ఆది. తిన్న దెబ్బలు సరిపోకపోయేసరికి మళ్ళీ "ముద్దంటే శ్రద్ధ‌ వాళ్ళ భాషలో చెప్పండి" అని ఈసారి యాని మాస్ట‌ర్‌ను అడిగాడు. ఆమె "గుస్సా గుస్సా" అని చెప్తుంది. ఇక ఆది రెచ్చిపోయి ఒక అరగంట సేపు గుస్సా అని కళ్ళు మూసుకుంటాడు. లాగిపెట్టి పొట్టలో దబిడి దిబిడి బాదేసింది శ్రద్ధ‌. ఇలా ఈ వారం ఎపిసోడ్ శ్రద్ధ‌ చేతిలో ఫుల్ గా తన్నులు తిన్నాడు ఆది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.