English | Telugu

గువ్వలతో గోవాలో బిగ్ బాస్ టేస్టీ తేజ!


బిగ్ బాస్ సీజన్ 7 పర్లేదు అనిపించేలా సాగుతోంది...ఈ సీజన్ మరీ లాస్ట్ సీజన్ అంత కాకపోయినా పర్లేదనిపించేలా వెళ్తోంది. ఇక ఈ సీజన్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన రతికా రోజ్, టేస్టీ తేజ, శుభశ్రీ రాయగురు ముగ్గురు కలిసి టైం దొరకడంతో గోవా టూర్ కి చెక్కేశారు. టేస్టీ తేజతో కలిసి శుభశ్రీ, రతికా ఫుల్ గా ఫొటోస్, సెల్ఫీస్ దిగేసారు. ఇక అక్కడ రెస్టారెంట్ లో నానా హంగామా చేసేసారు. ఆ ఫుడ్ ఐటమ్స్ పేర్లను వెరైటీగా పలుకుతూ తేజ మస్త్ ఎంటర్టైన్ చేసాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు లేడీస్ తో తేజ చేసిన హంగామా గురించి ఆడియన్స్ అందరికీ బాగా తెలుసు. తేజ రతికా అందాన్ని బయట చూసి ఫుల్ గా ఫ్లాటైపోయాడు. 'నువ్వెంటే బిగ్ బాస్ లో కంటే బయటే బాగున్నావ్ కదా" అంటూ పదేపదే ఆ మాట అంటూనే ఉన్నాడు.

ఇక తర్వాత వీళ్ళ వీడియోకి "గోవాలో గువ్వలం అని తేజ అనేసరికి "అంటే ఏమిటి" అంటే శుభశ్రీ రివర్స్ ప్రశ్నించింది. "రతికా సీరియస్ గా చెప్తున్నా చాలా క్యూట్ గా ఉన్నావ్" అని మళ్ళీ అనేసరికి "హౌస్ లో అందరినీ ఒకదగ్గర పెట్టేసరికి నాకు ఎం అర్ధం కాలేదు. ఇక్కడ చూడు ఎంత బాగుందో" అంటూ క్యూట్ గా ఆన్సర్ ఇచ్చింది రతికా. "నువ్వెలా ఉన్నావో తెలుసా గోడ్జిల్లా " లా ఉన్నావ్ అంటూ శుభశ్రీని అనేసరికి కొంచెం ఫీలయ్యింది పాప. ఇక తర్వాత లెబనీస్ చికెన్ అని రతికా ఒక ఫుడ్ ఐటెం పేరు చెప్పేసరికి "లెస్బియన్ చికెన్..నాకు ఇంగ్లీష్ అంతే వచ్చు" అంటూ కౌంటర్ ఇచ్చారు తేజ. ఇక వీడియో మొత్తం కూసే ఇద్దరు పాపలు తింటూనే కనిపించారు. "ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ తింటేనే పాపకు ఊపొస్తుంది" అంటూ రతికా గురించి కామెంట్ చేసాడు తేజ. బిగ్ బాస్ హౌస్ లో సరైన తిండి లేక బక్కచిక్కిన ఈ ముగ్గురూ కలిసి తిండి మీద దాడి చేస్తూనే అన్ని ఐటమ్స్ ని డెజార్ట్స్ ని లాగించేసారు.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.