English | Telugu
Brahmamudi:శోభనం గదిలో రచ్చ.. హాల్లో పడుకున్న భార్య!
Updated : Jan 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో.. కళ్యాణ్ అనామికలకి శోభనం ఏర్పాట్లు చేస్తారు. కళ్యాణ్ అనామికకి గిఫ్ట్ గా నక్లెస్ తీసుకొని వస్తాడు. అది ఇవ్వగానే అనామిక చాలా బాగుందంటు మురిసిపోతుంది. మరి ఏమనుకున్నావ్ మా వదిన సెలక్షన్ అంటే అని కళ్యాణ్ అనగానే.. అంటే ఇది నువ్వు తీసుకొని రాలేదా అని అనామిక అడుగుతుంది. నేనే తీసుకొని వచ్చాను కానీ మా వదిన సెలక్షన్ అని కళ్యాణ్ అనగానే.. నాకు నచ్చలేదంటు నక్లెస్ ని కిందపడేస్తుంది అనామిక.
అ తర్వాత అనామిక అలా చేసేసరికి కళ్యాణ్ కి కోపం వస్తుంది. మన మధ్యలో వాళ్ళు ఎందుకంటు, వాళ్ళకి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వడం లేదంటూ అనామిక ఏడుస్తుంది. అయిన నీ స్థానం నీదే.. ఎందుకు అలా అంటావ్ మన అప్పునే కదా.. మా వదిన కదా అని కళ్యాణ్ అంటాడు. నీకు ఫ్రెండ్.. నాకు కాదు. ఎవరు ఎక్కడ చస్తే నాకేంటని అనామిక అనగానే.. ఎందుకు ఇలా చేస్తున్నావంటు అనామికపై కళ్యాణ్ కోప్పడతాడు. నాకు నీతో శోభనం ఎందుకు? అవసరం లేదంటు డెకరేషన్ చేసిన బెడ్ ని మొత్తం చిందర వందర చేస్తుంది అనామిక. నేను వెళ్లి బయటపడుకుంటానని అనామిక వెళ్తుంటే కళ్యాణ్ ఆపుతాడు. అయిన వినకుండా అనామిక బయటకు వెళ్లి హాల్లో పడుకొని ఉంటుంది. మరుసటి రోజు ఉదయం స్వప్న నిద్ర లేచి బెడ్ కాఫీ అంటు రుద్రాణికి ఫోన్ చేస్తుంది. దాంతో రుద్రాణి త్వరగా లేచి కాఫీ కోసం వస్తుంటే హాల్లో పడుకొని ఉన్నా అనామికని చూసి ఈ విషయం అందరికి చెప్పాలంటు అందరిని వెళ్లి పిలుచుకొని వస్తుంది.
అ తర్వాత అందరు వచ్చి హాల్లో పడుకున్న అనామికని చూసి షాక్ అవుతారు. ఏమైందని ధాన్యలక్ష్మి అనగానే.. ధాన్యలక్ష్మిని అనామిక హగ్ చేసుకొని ఏడుస్తుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి నా వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ.. ఏదయినా ఉంటే గదిలో చూసుకుందామని అనామికని కళ్యాణ్ తీసుకొని వెళ్తుంటే.. రుద్రాణి ఆపి ఏం జరిగిందో చెప్పు అనామిక అని అడుగుతుంది. మా మధ్యలో ఎప్పుడు అప్పు, కావ్యల గురించి తీస్తున్నాడు. నాకు ఏమనిపిస్తుందని అనామిక అంటుంది. నీ చెయ్యి తాకితే అన్ని ఇలాగే అవుతాయంటు కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. కళ్యాణ్ చేసిన దానికి కావ్యని ఎందుకు తిడుతున్నావని రాజ్ అంటాడు. కళ్యాణ్ అన్న దానికి మమ్మల్ని ఎందుకు అంటున్నారని కావ్య అంటుంది. ఈ అక్క చెల్లల్లు మోసం చేసే ఈ ఇంట్లో అడుగు పెట్టారు కానీ నా కోడలు పెద్దల అంగీకారంతో ఇంట్లో అడుగుపెట్టిందని ధాన్యలక్ష్మి అనగానే.. రాజ్ కోపంగా కళ్యాణ్ అని అంటాడు. తరువాయి భాగంలో ఇక నుండి మా అప్పు గురించి గానీ, నా గురించి గానీ మాట్లాడకండి. మీ గురించి మాత్రమే మీరు మాట్లాడుకొండి అని అనామికకి కావ్య చెప్తుంది. ఆ తర్వాత నాకు సపోర్ట్ చేశారని రాజ్ భుజంపై తల వాల్చి కావ్య ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.